Chekkalu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలు. ఈ చెక్కలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి ఈ చెక్కలు మెత్తగా వస్తూ ఉంటాయి. సరిగ్గా ఫ్రై అవ్వకపోవడం ఇలాంటి చాలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. కదా సో అలాంటివి లేకుండా పర్ఫెక్ట్ గా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, బట్టర్, కరివేపాకు, పెసరపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా ఒక కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల అల్లం 50 గ్రాముల పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కేజీ బియ్యప్పిండిని పోసుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్లు అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ పిండిలో ముందుగా ఒక పావు కప్పు ఉప్పు మనం ముందుగా పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కుని వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. బటర్ని కూడా వేసుకోవాలి. హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి. ఇవిన్ని వేసిన తర్వాత బాగా కలిసేలా చక్కగా బాగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి.
ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకుని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత కొన్ని చిన్న పిండి ముద్దలు చేసుకునే మిగతాదంతా క్లాత్ ని వేసి కప్పుకోవాలి. ఇక ఉండలు చేసుకున్న వాటిని తీసుకొని పూరి ఫేస్ పై వాటిని ఒత్తుకుని ఒక క్లాత్ పై వేసుకోవాలి. ఇక తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని స్టవ్ పై పెట్టుకొని అది హీటెక్కిన తర్వాత దాంట్లో నాలుగైదు చెక్కలను వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అన్ని కూడా ముందే చేసి పెట్టుకోవాలి చెక్కలను. అలా చేసుకున్న వాటిని ఒక క్లాత్ పై పరుచుకొని చిన్నగా తీసుకొని వాటిని ఆయిల్లో వేసి చక్కగా రెండు వైపులా కాల్చుకోను తీసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా కరకరలాడుతూ చెక్కలు రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.