chicken fry can be easily made
Chicken Fry : ఈరోజు మన కిచెన్ లో టేస్టీగా చికెన్ ఫ్రై ని చూపించబోతున్నాను.. చికెన్ ఫ్రై ని చాలా ఈజీ మెథడ్ లో రుచిగా నీచు వాసన రాకుండా బాగా కుదిరేలా చేయాలంటే ఈ స్టైల్ లో చేయండి. ఎక్కువ క్వాంటిటీతో చికెన్ ఫ్రై చేయాలంటే ఇలాగే చాలా తేలిగ్గా ఎన్ని కిలోల చికెన్ అయినా కారం ఉప్పు వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ఫ్రై ని టేస్టీగా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా కుదరడమే కాదు చేసిన ఆ అలసట కూడా అనిపించదు.
దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,ఆయిల్ మొదలైనవి… చికెన్ ఫ్రై చేయడానికి కిలో చికెన్ తీసుకున్నాను ముందుగానే చికెన్ ని కట్ చేసి బాగా కడిగి తీసుకోండి. చికెన్ ఫ్రై కోసం మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లోని తీసుకున్నాను. ఇలా మనం ముందుగా చికెన్ ని కట్ చేసి బాగా కడిగి నీళ్లన్నీ పంపి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకోండి. అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పును తీసుకోండి.
అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపును తీసుకోండి. మనం చేసే చికెన్ ఫ్రై అనేది టెండర్గా రావడానికి ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఈ చికెన్ ని 15 నుండి 20 నిమిషాలు బాగా నానబెట్టాలి. ఇప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై లోకి సింపుల్ గా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఏవైతే మెజర్మెంట్స్ చెప్తున్నానో అది క్వాంటిటీని ఫాలో అవ్వండి. అలాగే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంపొడిని ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారంపొడిని తీసుకుంటున్నాను.. సో మనం తీసుకున్న కిలో చికెన్ కి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ మిరియాలయితే కరెక్ట్ గా సరిపోతుంది అండి.
chicken fry can be easily made
ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సోంపుని అలాగే కొన్ని స్పైసెస్ తీసుకుందాం. దాల్చి చెక్క నాలుగైదు యాలకులు ఐదారు లవంగాలు ఒక స్టార్ అనేసాను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం తరిగిన ఉల్లిపాయలు తీసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. బిర్యానీ కోసం మనం ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎలా అయితే ట్రై చేస్తామో అచ్చం అలాగే ట్రై చేయాలి. నానా పెట్టిన చికెన్ ముక్కల్ని కూడా తీసుకోండి. ఇలా మనం చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ముక్కలను తీసుకొని బాగా ఫ్రై చేయండి.
ఎప్పుడైతే చికెన్ అనేది ఇలా బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఇదే టైం లో మనం గ్రాండ్ చేసి పెట్టిన కారం పొడిని తీసుకుందాం. ఇలా కారం పొడిని తీసుకున్నాక కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే కారం కూడా పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా వస్తుంది… 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అయినా చికెన్ తీసి వేరే గిన్నెలోకి సర్యు చేసుకోవడం అంతే చికెన్ ఫ్రై రెడీ.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.