Rava Idli Recipe : హోటల్ స్టైల్లు ఇనిస్టెంట్ రవ ఇడ్లీ, చట్నీ కాంబినేషన్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు గాని లేకపోతే క్విక్ గా ఇన్సిడెంట్ గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ అన్న మాట క్విక్ గా చేసేయొచ్చు. ఈజీగా చేసేయొచ్చు. అండ్ టేస్టీగా తినేసేయొచ్చు.. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కాంబినేషన్ గా మనం టమాటా చట్నీ తయారు చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు : ఆయిల్, మినప గుండ్లు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, టమాటాలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, తాళంపు గింజలు, ఇంగువ, ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు,
బొంబాయి రవ్వ, వంట సోడా, కొత్తిమీర, పెరుగు, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా చట్నీ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో రెండు స్పూన్ల మినప గుండ్లు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, కొంచెం పసుపు కూడా వేసి బాగా ఉడికించుకొని తర్వాత వాటిని చల్లారనిచ్చిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తటి చట్నీల పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసి ఈ చట్నీలో కలుపుకోవాలి. ఇక ఇడ్లీ కోసం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను పచ్చిశనగపప్పు,
మినప గుండ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొన్ని కొంచెం కరివేపాకు కొన్ని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా ఉడికే వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి బాగా వేయించి తర్వాత దానిని వేరే బౌల్ లోకి తీసుకొని దాన్లో ఒక కప్పు పెరుగు ఒక రెండు స్పూన్ల ఉప్పు కొంచెం వంటసోడా వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు నాన్నని ఇవ్వాలి. తర్వాత మూత తీసి దానిలో కొంచెం వాటర్ ని యాడ్ చేసి బాగా కలిపి ఇడ్లీ పాత్రలో వేసి ఇడ్లీల చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా ఇనిస్టెంట్ ఇడ్లీ అండ్ చెట్ని రెడీ..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.