Acidity : ఎసిడిటీ,గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా... ఈ ఇంటి చిట్కాలను పాటించండి...!
Acidity : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారంతో ప్రజలు ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కొంటున్నారు. అలాంటి అనారోగ్య సమస్యల్లో ఫుడ్ పాయిజన్, వాంతులు, విరోచనాలు, కడుపు సమస్యలు.ఈ సమస్యలు అనే వి చాలా సాధారణంగా మారాయి. ప్రస్తుత కాలంలో గ్యాస్,ఎసిడిటీ సమస్య కూడా చాలా సాధారణంగా మారింది అని చెప్పొచ్చు. సాధారణంగా ప్రతి ఇద్దరిలో కూడా ఒకరు ఎసిడిటీ సమస్యతో ఎంతో బాధపడుతున్నారు. వేపుడు, మసాలా, అధికకారం, సమయ పాలన అనేది లేకుండా ఆహారం తినటం వలన కూడా ఎసిడిటీ సమస్యలు అనేవి వస్తున్నాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఎసిడిటీ వలన కడుపులో గ్యాస్ అనేది ఏర్పడుతుంది. దీని వలన వ్యక్తి కడుపు నొప్పి లేక తలనొప్పి, కడుపులో మంట లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో గ్యాస్ మాత్రలు వేసుకోవడం అంత మంచిది కాదు. అలాగని తీసుకోకుండా ఉండలేము. అయితే సాధ్యమైనంతవరకు గ్యాస్ సమస్యలు నయం చేసేందుకు ఇంటి నివారణ చిట్కాలను కూడా పాటించినట్లయితే చాలా మంచిది. మన వంటింట్లో ఉండే కొన్ని రకాల పానీయాలు ఎసిడిటీ,గ్యాస్ ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తాయి.అదేమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం…
వాము నీటిని తీసుకోవటం వలన మీరు ఎ సిడీటీ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు సాధారణ నీటిలో అర చెంచా వాము గింజలను వేసుకొని తాగటం వలన ఎసిడిటీ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు…
ఎసిడిటీ సమస్య వచ్చినట్లయితే నిమ్మరసం లేక బ్లాక్ సాల్ట్, సోడా కలిపిన నీటిని తాగటం వలన ఎసిడిటీ సమస్యకు దూరంగా ఉండవచ్చు…
చల్లని పాలు : ఎసిడిటీ సమస్య ఉన్నట్లయితే చల్లని పాలు తాగటం వలన కూడా ఈ సమస్య నుండి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే ఎసిడిటీ సమస్య వస్తే దానిలో పంచదార లేక ఉప్పులాటి పౌడర్లను చేయకూడదు అని గుర్తుంచుకోవాలి.
Acidity : ఎసిడిటీ,గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలను పాటించండి…!
ఇంగువ : ఎసిడిటీ ప్రభావాలను నియంత్రించడానికి ఇంగువ కూడా మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీంతో మీరు ఇంగువ నీటిని కూడా తీసుకోవచ్చు. వంటకాలు వండేటప్పుడు కొంచెం ఇంగువ జోడించడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది..
మజ్జిగ : గ్యాస్ సమస్య వచ్చినప్పుడు మజ్జిగను తీసుకున్న కూడా ఉపశమనం పొందవచ్చు. దీన్ని తాగటం వలన కడుపులోని మంట నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకునే తాగితే ఎంతో మేలు జరుగుతుంది…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.