Almond Peels : ప్రస్తుతం ప్రజలలో ఆరోగ్యం పట్ల ఎంతో అవగాహన పెరిగింది. అలాగే వ్యాధులు అనేవి రాకుండా ఉండడానికి రోగనిరోక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలలో డ్రై ఫ్రూట్స్ కూడా. వీటిలో ముఖ్యంగా బాదంపప్పు. ఈ బాదంపప్పును ఎంతో మంది నానబెట్టుకొని ఉదయాన్నే తిట్టు ఉంటారు. ఇలా తినడం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. కానీ నానబెట్టినటువంటి బాదంపప్పులను తొక్క తీసేసి తింటున్నారు. అయితే బాదం పప్పులలాగే వాటి తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా. ఈ బాదం పప్పు యొక్క తొక్కలో శరీర సామర్థ్యాలను పెంచే మరియు ఆరోగ్యకరమైన లక్షణాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
బాదంపప్పు లాగే వాటి యొక్క తొక్కలో కూడా మనకు కావలసిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ తొక్కలో విటమిన్స్ మరియు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి. ఇవి చర్మం మరియు జుట్టుకు ఎంతో బాగా పని చేస్తాయి. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం చూస్తే, ఈ బాదం తొక్కలలో పాలీఫైనాల్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కంటి చూపును మరియు జ్ఞాపకశక్తిని కూడా ఎంతగానో పెంచుతాయని అంటున్నారు నిపుణులు. అలాగే షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ కి కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ బాదం తొక్కలో ఉన్నటువంటి పాలీఫైనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. అంతేకాక టైప్ టు డయాబెటిస్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కూడా పాలీపెనాల్స్ ఎంతో సహాయపడతాయి. ఇవి గుండెల్లో వచ్చే దీర్ఘకాలిక మంటను నియంత్రించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటుగా ఫాలీఫైనల్స్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరంలో రక్తం అనేది గడ్డ కట్టడం తీవ్రమైన అనారోగ్య సమస్య. దీంతో రక్తప్రసరణ అనేది ఆగిపోయి గుడ్డ పోటు మరియు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఫాలీ ఫైనాల్స్ అనేవి రక్తం గడ్డకట్టే ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది.
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం చూస్తే, ఈ ఫాలీ ఫైనాల్స్ క్యాన్సర్ ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుండి కూడా మనల్ని రక్షిస్తాయి. ఈ బాదంపప్పు తొక్కలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి పేగులో మంచి బ్యాక్టీరియాని కూడా ప్రోత్సహించగలవు. అంతేకాక బాదం తొక్కలు మరియు గుమ్మడికాయ గింజలతో పొడిని తయారు చేసుకొని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకున్నట్లయితే మలబద్ధకం నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ బాదం తొక్కలతో హెయిర్ మాస్క్ ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అరకప్పు బాదం తొక్క, ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ మరియు తేనే లాంటి వాటిని కలిపి ప్యాక్ కి కావలసిన విశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికి బాగా పట్టించుకోని దానిని బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి. దీంతో మీకు ఇంట్లోనే హెయిర్ చేసుకున్న సైన్ వస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యానికి కావలసినటువంటి విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.