Home » Health » Aloe Vera Juice
Health

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 26, 2025 12:42 pm

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ అలోవెరా తో ఆరోగ్యం కూడా ఉంది. అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించగలరు కలబంద. కలబంద చర్మానికి తేమను అందించడమే కాక జల్ల్ బాగా ప్రసిద్ధి చెందింది. కలబంద ముఖ్యంగా శీతాకాలంలో ఇది చర్మాన్ని పొడిబారకుండా చేయగలదు అంతేకాక పోషకాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం కలబంధ రసం సేవిస్తే శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు. కలబందలో ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు (ఏ సి ఈ) ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. జీనక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది…

Advertisement

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera Juice కలబందలోని పోషకాలు

పోషకాహార నిపుణులు తెలియజేసిన విషయం,కలబంధ రసంలో ఉండే మంటను తగ్గించే, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు, శరీరంలో మంటను గణనీయంగా తగ్గించగలరని తెలియజేశారు. శరీరం రక్షణ వ్యవస్థను సమతుల్యం చేసి వ్యాధుల నుంచి రక్షించగలదు. ఇందులోని పాలు, కలబంద లో ఉండే సహజ విటమిన్లను రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు తోడ్పడుతుంది. పోషకాహార నిపుణులు సూచించే విధంగా,రోజుకు 50 మిల్లీమీటర్ల నుండి 120 మిల్లీ లీటర్ల వరకు కలబంద రసాన్ని తాగితే కొన్ని ప్రాథమిక పరిశోధన ప్రకారం.. రక్తంలో డయాబెటిస్ అదుపులోకి వస్తుందని తెలియజేశారు నిపుణులు. కలబంద రసం తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్ధకం పుల్లని తేంపులు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

Advertisement

అంతేకాకుండా ఇది నోటి లోపల ఉండే గాయాలపై కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. మంటను తగ్గించే గుణాల వల్ల పళ్ళ మధ్య నరాల ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంది. కలబందలో ఉండే ప్రోటీయోలిటిక్ ఎంజైమ్స్, జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. కొత్త జుట్టు పెరగడానికి ప్రోత్సహిస్తుంది. తలకు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. కొత్త జుట్టు రావడానికి ఇది పరిష్కారం అని చెప్పవచ్చు. కేవలం చర్మానికి మాత్రమే కాదు, కలబంద జీర్ణక్రియ రోగనిరోధక వ్యవస్థ,రక్తంలో షుగర్ నియంత్రణ జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తుంది. రోజు కలబంద రసాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ, ఎంత మోతాదులు తాగాలి అది మీకు ఎంత సరిపోతది లేదా అనే విషయం కూడా గమనించుకోవాలి. తగిన మోతాదుల్లో కలబంద జ్యూస్ ని తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో ఏదైనా తీసుకోకూడదు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి