Meat : మాంసం ఎక్కువగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!
Meat : కూరల్లో మాంసం కూర తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎందుకంటే మాంసం కూర తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే మాంసం కూరను తింటే చాలానే పోషకాలు అందుతాయని మనందరికీ తెలుసు. కాగా ఇది తింటే వచ్చే రోగాల గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏంటీ మాంసం తింటే రోగాలు వస్తాయా అని షాక్ అయిపోకండి.. మీరు విన్నది నిజమే. మాంసం కూర తింటే చాలా పెద్ద క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదు. దాంతో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాంసం కూరను తినేస్తున్నారు.
ఎందుకంటే చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఇలా మాంసం ఎక్కువగా తినడం వల్ల కూడా ఒక రకమైన క్యాన్సర్ వస్తుంది. అదే కొలొరెక్టల్ క్యాన్సర్. ఇది పెద్దపేగుకు వస్తుందని చెబుతున్నారు. తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఇది ప్రధానంగా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా స్థూలకాయంగా ఉండటం, దానికి తోడు ఆల్కహాల్ లేదా పొగాకు తాగడంతో పాటు పండ్లు కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం లాంటివి కూడా ఇది రావడానికి కారణం అవుతుంటాయి. చాలా మంది కొవ్వు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అందులోనూ రెడ్ మీట్ ను బాగా తింటుంటారు. ఈ మధ్య ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఫుడ్ ను అధికంగా తింటున్నారు. దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మాంసాన్ని ఎక్కువ వేడితో వండినప్పుడు ఆ మాంసంలో నుంచి క్యాన్సర్ కారక రసాయణాలు బయటకు వస్తుంటాయి.
Meat : మాంసం ఎక్కువగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!
అవి పెద్దపేగు క్యాన్సర్ కు కారణం అవుతుంటాయి. మనం తినేటప్పుడు కూడా అవసరం అయినంత తినకపోవడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం లాంటివి కూడా పెద్దపేగు క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఇలా పెద్దపేగు క్యాన్సర్ వచ్చినప్పుడు మలబద్దకం, విరేచనాలు, మలంలో రక్తం రావడం లాంటివి జరుగుతాయి. త్వరగా అలసిపోవడం, సడెన్ గా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముందుగానే తగిన చికిత్స తీసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.