Banana Smoothie : ఈ సమ్మర్ లో రోజు అవకాడో, బనానా స్మూతి తీసుకుంటే చాలు... అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు..
Banana Smoothie : వయసు తరహా లేకుండా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్య అధిక బరువు.. అధిక బరువు అనేది ఈజీగా పెరుగుతారు. కానీ బరువు తగ్గాలంటేనే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు.. అలాంటివారు ఈ సమ్మర్లో బరువు తగ్గే ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే సహజంగా కూడా శీతాకాలంతో పోలిస్తే వేసవిలో మనకి తెలియకుండానే బరువు తగ్గుతాము.. తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన తొందరగా కొవ్వు కరుగుతుంది. కావున ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతామో ఇప్పుడు మనం చూద్దాం.. అవకాడో, బనానా స్మూతీ రెసిపీ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్మూతీ ఒక పూట ఆహారంగా తీసుకొని భోజనం మానేస్తే శరీరానికి ఎన్నో పోషకాలు అందడంతో పాటు కొవ్వు లాంటివి శరీరానికి అందవు.. కావున త్వరగా బరువు తగ్గొచ్చు.. అవకాడో బనానా స్మూతీ చేయడం కూడా చాలా ఈజీ.. అవి కూడా ఖర్చు తక్కువే అవకాడో, బనానా స్మూతీలో అవకాడో అర ముక్క వేస్తే చాలు.. దీన్ని వండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇది తిన్నాక భోజనం లాంటివి తీసుకోకూడదు..
ద్రవపదార్థాలు లాంటివి మాత్రమే తీసుకోవాలి. ఇంట్లోనే చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ లాంటివి తాగితే చాలా మంచిది. కానీ చక్కెర మాత్రం అసలు కలుపుకోవద్దు..అవకాడో చాలా తక్కువ మంది తింటూ ఉంటారు. దీని కచ్చితంగా తీసుకోవాలి. అవకాడో ఎక్కువ ఖరీదు అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. ఒక పండుని కొన్నాక దాని రెండు ముక్కలు చేసి రెండుసార్లు స్మూతీ లాగా యూస్ చేసుకోవచ్చు.. అవకాడో పండును అప్పుడప్పుడు తీసుకోవడం వలన పేగు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ప్రధానంగా బరువును తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భంతో ఉన్న స్త్రీలు అవకాడోను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం దీని వల్ల తగ్గుతుంది.అధిక బరువు ఊబకాయం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కావున వారానికి రెండుసార్లు అవకాడోలను తీసుకోవడం చాలా ముఖ్యం. రెండు అవకాడోలను నాలుగు ముక్కలుగా చేసుకుని నాలుగు రోజులు తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది. రోజుకో అవకాడో పండుని తిన్న మంచిదే.. అధిక రక్తపోటు తగ్గించడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Banana Smoothie : ఈ సమ్మర్ లో రోజు అవకాడో, బనానా స్మూతి తీసుకుంటే చాలు… అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు..
ఈ సమ్మర్లో అవకాడో బనానా స్మూతీ లేదా అవకాడో పండు ఏదైనా కలిపి స్మూతులుగా మార్చుకొని తీసుకోవడం వలన బరువు ఈజీగా తగ్గుతారు..
ఈ అవకాడో బనానా స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. అవకాడో ఆరముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అరటిపండును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్లో అవకాడో పండును అరటిపండు ను ముక్కలు వేసి పాలు తేన వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ స్మూతిని తర్వాత ఒక గ్లాసులో పోయాలి. పైన సన్నగా తరిగిన పిస్తా తో గార్నిష్ చేసుకోవాలి. అంతే స్మూతీ ఈజీగా రెడీ అవుతుంది. దాన్ని స్పూన్ తో తీసుకోవాలి. ఇది ఒక పూట భోజనంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఆకలిగా ఉంటే వాటర్ మిలన్ జ్యూస్ లాంటివి తీసుకోవాలి. నిమ్మరసం తాగిన ఓకే.. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. అల్పాహారంలో ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో ఈ స్మూతీ లాంటివి తీసుకుంటే మంచిది. రాత్రికి తేలికపాటి భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు నెల రోజులలోనే కొన్ని కిలోల బరువు తగ్గుతారు. ఈ స్మూత్ వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. కాబట్టి పోషకాహార లోపం కూడా ఉండదు…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.