Home » Health » Beauty Tips In Honey Yellow
Health

Beauty Tips : మొటిమ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా.. ఈ ఒక్క చిట్కాతో అన్నిమాయం.. కానీ ఇలా మాత్రం చేయ‌కండి

Authored By
mallesh
The Telugu News | Published on: May 6, 2022, 5:30 pm
Advertisement

Beauty Tips : మొఖంపై పింపుల్స్ క‌న‌బ‌డ‌గానే అల్లాడిపోతారు. మిర్ర‌ర్ లో త‌రుచూ చుసుకుంటు బాధ‌ప‌డ‌తారు. ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తుంటారు. తెగ హైరానా ప‌డిపోతుంటారు. మర్కెట్లో దొరికే క్రేమ్ లు, పౌడ‌ర్లు వాడ‌తుంటారు. దీంతో ఈ మొటిమ‌లు త‌గ్గ‌క‌పోగా మ‌రింత బాధించే ప్ర‌మాదం ఉంది. ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ద‌శ‌లో, మారుతున్న జీవనశైలి, కాలుష్యం, హార్మోన్‌లలో మార్పుల‌ వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. టీనేజర్స్‌లో ముఖ్యంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర సాధారణ చర్మ సమస్య ఇలా చాలానే ఉన్నాయి.

Advertisement

క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు, ఫేస్‌మాస్క్‌లతో నివారించని కొన్నిచర్మ సమస్యలు, మొటిమలు మనం తీసుకొనే ఆహార‌పు అల‌వాట్ల‌తో తొలగిపోతాయి. స‌హ‌జ‌సిద్దంగా మొటిమ‌లు ఎలా త‌గ్గించుకోవాలో ఎప్పుడు చూద్దాం..అయితే ముఖంపై మొటిమ‌లు ఎర్ప‌డిన‌ప్పుడు చాలా మంది వాటిని తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స్థానంలో గుంత‌లు, మ‌చ్చ‌లు ఎర్ప‌డ‌తాయి. అందుకే వీటిపై తేనె గానీ, ప‌సుపుగానీ రాయ‌డం వ‌ల్ల న‌ల్ల‌మ‌చ్చ‌లు రాకుండా చూడ‌వ‌చ్చు. అలాగే నీళ్లు ఎక్కువ‌గా తాగాలి. ఇందువల్ల శరీరంలో ఉన్నటాక్సీన్స్ చెడు చెమట, మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడి శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది.

Beauty Tips in Honey yellow

Advertisement

మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ప్రాణయామం, యోగా చేస్తే మంచిది. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అయితే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి.ముఖంపై అయిల్ తో కూడిన జిడ్డు లేకుండా రెగ్యూల‌ర్ గా ముహం శుభ్రంగా చేసుకోవాలి. ఫ్రూట్స్, కూర‌గాయ‌ల‌తో ముఖాన్ని ర‌బ్ చేసుకోవాలి. అలాగే న‌ల్ల‌ని శుభ్ర‌మైన మ‌ట్టిని తీసుక‌ని వాట‌ర్ మిక్స్ చేసి మెత్త‌గా త‌యారుచేసుకోవాలి. ఇందులో కొంచెం ప‌సుపును క‌లిపి ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఓ అర‌గంట త‌ర్వాత క‌డిగేసుకోవాలి. ఇలా చేస్తే ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి న‌ల్ల మ‌చ్చ‌లు, గుంత‌లు తొల‌గిపోతాయి. అలాగే బియ్యం క‌డిగిన త‌ర్వ‌త వ‌చ్చే వాట‌ర్ తో కూడా ముఖంపై అప్ల‌య్ చేసుకుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి