Home » Health » Benefits Of Vajra Danti Plant
Health

Vajradanti Plant Benefits : ఇది పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే..దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Authored By
Suma
The Telugu News | Published on: February 4, 2026, 6:00 am
Advertisement

Vajradanti Plant Benefits : పల్లెటూరి వాతావరణం అంటేనే ప్రశాంతత, స్వచ్ఛత గుర్తుకు వస్తాయి. పొలం గట్లు, పచ్చని చెట్లు, ఉదయాన్నే వినిపించే పక్షుల కిలకిలలు ప్రతి ఒక్కరి మనసును హాయిగా మారుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా పెరిగే అనేక రకాల మొక్కలు మన చుట్టూ దర్శనమిస్తుంటాయి. అయితే వాటిలో చాలావరకు మొక్కలను మనం నిర్లక్ష్యంగా “పిచ్చి మొక్కలు” అని పిలుస్తూ ఉంటాం. కానీ అదే మొక్కల్లో కొన్ని అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. అలాంటి అరుదైన ఔషధ మొక్కల్లో వజ్రదంతి ఒకటి. ఆయుర్వేద వైద్యులు ఆరోగ్య నిపుణులు ఈ మొక్కలో దాగి ఉన్న గుణాలను ఎంతో విలువైనవిగా చెబుతున్నారు.

Advertisement

Vajradanti Plant Benefits : ఇది పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే..దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Vajradanti Plant Benefits : దంత ఆరోగ్యానికి వజ్రదంతి చేసే మేలు

పసుపు రంగు పూలు చిన్న ముళ్లతో కనిపించే వజ్రదంతి మొక్కను గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా చూడొచ్చు. ముఖ్యంగా నోటి ఆరోగ్యం విషయంలో ఈ మొక్క అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. దంత సమస్యలు, చిగుళ్ల బలహీనత, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గించడంలో వజ్రదంతి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కను నోటి శుభ్రత కోసం పురాతన కాలం నుంచే వినియోగిస్తున్నారు. చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యలకు వజ్రదంతి ఆకులు నమలడం ద్వారా ఉపశమనం లభిస్తుందని గ్రామీణ ప్రజల అనుభవం చెబుతోంది. అంతేకాదు నోటి పూతను తగ్గించడంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందట. ఇప్పటికీ పల్లెల్లో చాలామంది ఈ మూలికను సహజమైన దంత సంరక్షణకు ఉపయోగిస్తుండటం విశేషం.

Advertisement

Vajradanti Plant Benefits : అనేక వ్యాధులకు సహజ పరిష్కారం

వజ్రదంతి కేవలం దంత సమస్యలకే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటంతో పిప్పి పన్ను సమస్యతో బాధపడేవారు దీని ఆకు రసాన్ని నొప్పి ఉన్న చోట వేస్తే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. అలాగే దీని ఆకులు నమలడం వల్ల చిగుళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయట. వజ్రదంతి పూలు, ఆకులు, వేర్లు అన్నీ ఔషధ గుణాలతో నిండినవే. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ ఆకుల రసాన్ని నొప్పి ఉన్న భాగాలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుందట. చర్మ సమస్యలు, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత ఇబ్బందులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడం కాలేయ పనితీరును మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కూడా వజ్రదంతి వల్ల కలుగుతాయట. అందుకే ఈ సహజ ఔషధ మొక్కను సరైన అవగాహనతో వినియోగిస్తే ఆరోగ్యానికి మంచి మిత్రంగా మారుతుంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి