Home » Health » Country Chicken Broiler Chicken Which Is Better For Health
Health

Chicken : నాటు కోడి .. బ్రాయిలర్ కోడి .. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా ?

Authored By
Suma
The Telugu News | Published on: February 2, 2026, 8:00 am
Advertisement

Broiler Chicken vs Country Chicken : చికెన్ అంటే ఎక్కువమంది ఇష్టపడతారు. ఫ్రై, బిర్యానీ, సూప్.. ఏ రూపంలో తిన్నా రుచి మర్చిపోవడం కష్టం. కానీ మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే బ్రాయిలర్ కోడి  Broiler Chicken ఆరోగ్యానికి నష్టం చేస్తుందా? లేక పల్లె ప్రాంతాల్లో సహజంగా పెరిగే నాటు కోడి  Country Chicken మేలు చేస్తుందా? కేలరీలు, ప్రోటీన్, కొవ్వు శాత లో ఉన్న తేడాలను తెలుసుకొని ఏది మనకు ఎక్కువ ప్రయోజనకరమో తెలుసుకుందాం.

Advertisement

Chicken : నాటు కోడి .. బ్రాయిలర్ కోడి .. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా ?

Broiler Chicken vs Country Chicken : బ్రాయిలర్ కోడి వెనుక ఆరోగ్య ప్రమాదాలు

చాలామంది తక్కువ ధరలో లభించే బ్రాయిలర్ చికెన్‌ను తీసుకుంటారు. కానీ వీటి పెంపకం వెనుక ఒక తీవ్రమైన సమస్య ఉంది. బ్రాయిలర్ కోడిని వేగంగా పెంచడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ విరివిగా ఉపయోగిస్తారు. తరచుగా వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రాయిలర్ మాంసంలో సహజ పోషకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి కండరాల బలం, ఎముకల ఆరోగ్యం మొదలైన వాటికి ఎక్కువ ఉపయోగం లభించదు. అందువల్ల తక్కువ ధరతో ఆకర్షితమయ్యే ముందు దీని ఆరోగ్య ప్రభావాలను గుర్తించాలి.

Advertisement

Broiler Chicken vs Country Chicken : నాటు కోడి – సహజమే, ఆరోగ్యానికి మేలు

నాటు కోడి పల్లెలో ప్రకృతి ఒడిలో పెరుగుతుంది. సహజ ఆహారం తింటూ మందుల లేని పద్ధతిలో పెరిగినందున మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో సుమారుగా 150 కేలరీలు ఉంటే అదే నాటు కోడిలో కేవలం 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో వెయిట్ లాస్ కోసం అనుకూలంగా ఉంటుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. ఐరన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు రక్తనిర్మాణం, రోగనిరోధక శక్తి పెంపుకు కీలకంగా ఉంటాయి. నాటు కోడి ప్రోటీన్, విటమిన్ డి, ఇ, బి-కాంప్లెక్స్‌ లను సమృద్ధిగా అందిస్తుంది కాబట్టి కండరాల పుష్టికి, ఎముకల బలానికి, శరీర శక్తికి నాటు కోడి ఉత్తమం.

Broiler Chicken vs Country Chicken : నాటు కోడి ఎంచుకోవడమే మంచిది

ధర కొంచెం ఎక్కువగా ఉన్నా రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం నాటు కోడిని ఎంచుకోవడం ఉత్తమం. సరైన పద్ధతిలో వండితే నాటు కోడి మన శరీరానికి అవసరమైన పోషకాలందరిని అందిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి నాటు కోడి అనుకూలం. గుండె, ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తి మరియు రక్తహీనత నివారణకు నాటు కోడి సహాయపడుతుంది. ఇక బ్రాయిలర్ కోడి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది కానీ దీని దుష్ప్రభావాలు అధికం. నాటు కోడి కొంచెం ఖర్చు పెరుగుతుందని అనిపించిన దీని సహజ పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దీన్ని నిజమైన ఎంపికగా నిలిపే శక్తి కలిగివుంటాయి.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి