Milk : పాలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఈ పాలను సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. అందుకే పుట్టిన పసి పిల్లలకు పాలను మాత్రమే ఇస్తారు. అయితే ఈ పాలల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఈ పాలనేవి చూడటానికి ఒకేలా ఉన్న కానీ పోషణలో మాత్రం చాలా తేడా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ శరీరాన్ని బట్టి పాలను తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ పాలు అనేవి ఎన్ని రకాలు మరియు ఈ పాలు ఎవరికి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పాలను పిల్లలు మాత్రమే కాకుండా చాలా మంది తాగుతూ ఉంటారు. అయితే ఆవు పాలలో ఉన్న ప్రోటీన్ ను ఉత్తమ మూలంగా చెబుతూ ఉంటారు. అయితే హెల్త్ లైన్ ప్రకారం చూస్తే, 240 ml పాలల్లో 149 కేలరీలు మరియు ఎనిమిది గ్రాముల ప్రోటీన్, కొవ్వు, 12 గ్రాముల పిండి పదార్థాలు, 28% కాల్షియం, 26% రీబోప్లావిన్, 24% విటమిన్ డి, 18% విటమిన్ బి 12, 22% ఫాస్పరస్,10% పొటాషియం, 13% సెలీనియం ఉన్నాయి…
సోయా పాలు : ఈ పాలల్లో కూడా ప్రోటీన్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. అంతేకాక సోయా పాలల్లో 105 కేలరీలు, 12 గ్రాముల పిండి పదార్థాలు, 6 గ్రా ప్రోటీన్, 4 గ్రాముల కొవ్వు, 34% విటమిన్ బి 12, 30% కాల్షియం, 26% విటమిన్ డి, 26% రైబో ఫ్లావిన్,10% పాస్పరస్ ఉంటాయి…
ఓట్స్ పాలు : ఈ పాలల్లో 240 మి.లి సర్వీసింగ్ లో 120 కెలరీలు,3 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల ఫైబర్,5 గ్రాముల కొవ్వు, 50% విటమిన్ బి 12, 16 గ్రాముల పిండి పదార్థాలు, 46% రీబో ప్లావిన్, 22% పాస్పరస్, 27% కాల్షియం, 18% విటమిన్ డి లాంటి విటమిన్లు కూడా ఉన్నాయి..
మేక పాలు : ఈ పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని ఎంతోమంది భావిస్తారు. అయితే హెల్త్ లైన్ ప్రకారం చూస్తే, ఒక కప్పు పచ్చి మేక పాలల్లో 146 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 11.4 గ్రాముల ఇనుము, 23% కాల్షియం, 7.81 గ్రాముల కొవ్వు, 8% పొటాషియం, 26% విటమిన్ బి2, మరియు 55% విటమిన్ బి 12 లభిస్తాయి.
A2 పాలు : ఇవి ఒక రకమైన దేశి గిరి ఆవు పాలు అని చెప్పొచ్చు. అయితే ఈ పాలలో A2 ప్రోటీన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ పాలు A2 ప్రోటీన్ ను మాత్రమే ఉత్పత్తి చేయగల ఆవుల నుండి వస్తుంది. అయితే A1 ప్రోటీన్ ఈ పాలలో అసలు ఉండదు. అలాగే ఆవు పాలు అలర్జీ ఉన్న వ్యక్తులు ఈ రకమైన పాలకు దూరంగా ఉండటమే మంచిది.
బాదంపాలు : బాదంపప్పును నీళ్లలో నానబెట్టుకుని మిక్స్ చేసుకొని వడగట్టి బాదం పాలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే హెల్త్ లైన్ ప్రకారం చూస్తే, ఈ పాలల్లో 240మి.లీ పాలల్లో 41 కేలరీలు, 1 గ్రాఫ్ ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 50% విటమిన్ ఇ, 2 గ్రాముల పిండి పదార్థాలు కూడా ఉన్నాయి. అలాగే పాడి పాలు లేక ఆవు పాలతో అలర్జీ ఉన్నటువంటి వారికి ఈ పాదం పాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే బాదం గింజలు అంటే అలర్జీ ఉన్నవారు ఈ పాలను తీసుకోకుండా ఉండాలి అని అంటున్నారు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.