Home » Health » Easily Remove Chemicals From Fruits And Vegetables With
Health

Vegetables : పండ్లు మరియు కూరగాయలపై ఉన్న రసాయనాలను ఈజీగా ఇలా తొలగించండి…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 27, 2024, 10:00 am
Advertisement

Vegetables : ప్రస్తుత కాలంలో పంటలకు రసాయనాలు వాడకం చాలా బాగా పెరిగిపోయింది. అయితే కూరగాయలు మరియు పండ్లను పండించే రైతులు కీటకాల నుండి రక్షించేందుకు ఎంతో హానికరమైన రసాయనా లను వాడుతున్నారు. అలాగే దిగుబడి రేటు పెరిగేందుకు కూడా రకరకాల రసాయనాలను మరియు పురుగు మందులను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇలా రసాయనాలు చల్లిన ఆహారాలు అనేవి ఆరోగ్యానికి అసలు మంచివి కాదు. అయితే కూరగాయల నుండి రసాయనాలను ఎలా తొలగించాలి. వాటిని ఎలా. వాడుకోవాలి. అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ కింది చిట్కాలను పాటించటం వలన కొంతవరకైనా మనం వాటి ప్రభావం నుండి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

కూరగాయలను ఉడికించే ముందు గోరువెచ్చ ని నీటిలో శుభ్రంగా కడిగితే టాక్సిన్స్ అనేవి బయటకు పోతాయి. అలాగే అధిక వేడి లేక చల్లటి నీటిలో కడగటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందువలన గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేయాలి. అంతేకాక పండ్లను కూడా ఇదే విధంగా కడిగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకొని ఒక అర చెంచా ఉప్పు వేసుకోవాలి. దీంతో ఉప్పు అంత కూడా నీటిలో బాగా కలుస్తుంది. అప్పుడు ఈ ఉప్పు నీటిలో పండ్లను మరియు కూరగాయలను వేసి బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని నార్మల్ నీటితో కడిగితే చాలు. ఇలా చేయడం వలన ఆహారం రసాయనాల రహితంగా మారతాయి.

Vegetables : పండ్లు మరియు కూరగాయలపై ఉన్న రసాయనాలను ఈజీగా ఇలా తొలగించండి…!

Advertisement

ఎన్నో రకాల రసాయనాలు అనేవి కూరగాయల తొక్కలపై బాగా పేరుకొని పోతాయి. ఇవి క్రిమిసంహారకాలను తొలగించేందుకు నీటితో కడిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వెనిగర్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత సాధారణ నీటిలో కడిగితే చాలు. తర్వాత వంటకు వాడుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. అంతేకాక ఉల్లిపాయ, బంగాళదుంప, యాపిల్, నారింజ, అల్లం, మామిడి, క్యారెట్,ముల్లంగి, దుంప లాంటి పండ్లు మరియు కూరగాయలను తొక్క తీయటం కూడా ఎంతో సులభం అవుతుంది. ఈ ఆహారాన్ని బాగా కడిగిన తర్వాత మాత్రమే దానిపైన ఉన్నటువంటి తొక్కను తీసివేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో వేసి పలుచగా చేసుకోవాలి. దీనిని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకొని చల్లని ప్రదేశంలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండ్లు మరియు కూరగాయలపై స్ప్రే చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి