ever heard of stomach sounding the original is why it comes
Health Problems : మీ పొట్ట ఎప్పుడైనా సౌండ్ చేయడం విన్నారా.. గుర్.. గుర్ అంటూ పేగులు అరవడం చాలా మంది వినే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితి వచ్చే ఉంటుంది. నిశబ్ధంగా ఉన్న సమయంలో పొట్ట అరుపులు వినిపిస్తాయి. ఇలా పొట్ట నుండి వచ్చే శబ్దాలను ఏమంటారో చాలా మందికి తెలియక పోవచ్చు. అలా కడుపులో నుండి వచ్చే సౌండ్ ను బోర్బోరిగి అని అంటారు. అలాగే మనం పేగులు ఒర్రుతున్నయ్ అని కూడా చెప్తుంటాం. మరి ఆ చప్పుడు ఎందుకు వస్తుంది… దానీ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆహారం, ద్రవం మరియు వాయువు ప్రేగుల గుండా వెళుతున్నప్పుడు ఇలా సౌండ్స్ వస్తాయి.
బోర్బోరిగి ఆకలితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత వెళ్లే మార్గంలో పేగులు సంకోచించిన సమయంలో విడుదలయ్యే హార్మోన్ల స్రవాలతో కూడా దీనిని సంబంధం ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా అరగక పోవడం, లేదా జీర్ణ సమస్యలు తలెత్తడం లాంటి కారణాలతో ఇలా శబ్దాలు వస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న సమయంలోనూ ఇలా పొట్ట అరవడం చేస్తుంది. ఇలా పొట్టలో నుండి వచ్చే సౌండ్స్ ఒక్కోసారి బిగ్గరగా ఉంటాయి. పక్క వారికి వినిపించేలా కూడా వస్తాయి. అయితే ఇలా పొట్ట శబ్దం చేయకుండా ఆపడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
ever heard of stomach sounding the original is why it comes
1. నీళ్లు తాగడం ద్వారా పొట్ట నుండి వచ్చే అరుపులను కంట్రోల్ చేయవచ్చు. ఆకలి అయిన సమయంలోనూ ఇలా సౌండ్స్ వస్తాయి. కాబట్టి నీరు తాగితే వీటిని ఆపొచ్చు.
2. అలాగే ఆహారం తినే సమయంలో బాగా నమిలి మింగాలి. నెమ్మదిగా తినాలి. ఇలా చేయడం ద్వారా గాలి లోపలికి పోకుండా ఉంటుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి జరగవలసి అవుతుంది ఇలా జరగడం వలన శరీరంలో చేరిన శబ్దాలను చేస్తుంది.
3. సమయం ప్రకారం ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఒక టైం అంటూ పెట్టుకుని దానికే కట్టుబడాలి. ఇష్టమొచ్చిన రీతిలో తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది పొట్టలో సౌండ్స్ రావడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చేందుకు దారి తీస్తుంది.
4. ఆహారాన్ని ఎప్పుడూ అతిగా తిన కూడదు. కావాల్సిన మేర మాత్రమే తినాలి.
ATM Cash : డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు ఆర్బీఐ కల్పిస్తోంది. నగదు…
engue Vaccine : వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువే.…
Razakar Villain : రజాకార్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన…
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక…
Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో…
This website uses cookies.