Home » Devotional » Today Horoscope May 13 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 13 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 12, 2022 9:33 pm
Advertisement

మేషరాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకున్న వాటిని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. శ్రీ లక్ష్మీ సూక్తంతో పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి పనిచేసినా మీరు అనుకున్నదాని చేరుకోలేక నిరాశపడుతారు. సాయంత్రం నుంచి మీరు చేసిన పనికి లాభం చేకూరుతుంది. అనుకున్న అంత ఆదాయం ఉండదు. మహిళలకు పని భారం వత్తిడి పెరుగుతుంది. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : తల్లి తరుపు వారి నుంచి లాభాలు వస్తాయి, ఆర్థికంగా చక్కటి ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రియల్‌ రంగంలో మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసిన అప్పుల ద్వారా చికాకులు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా శుభ వార్తలు వింటారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. మహిలలకు శుభదినం. శ్రీ లక్ష్మీ దేవిని ఆరాధన చేయండి.

Today Horoscope May 13 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి శుభవార్తలు వింటారు. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. చక్కటి ఆహారం, విందులు, వినోదాలతో గడిచిపోతుంది. విద్య, వ్యాపారం అనుకూలం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. విద్య, ఉద్యోగం విషయాలలో కొంత శుభపరిణామాలు. పెద్దల నుంచి మంచి వార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. చాలాకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు లాభాలు. ఆస్తి సంబంధ విషయాలు అనుకూలం. మహిళలకు ధనలాభాలు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు శుభవార్తలను వింటారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. అనుకోని లాభాలు. శుభదినం. శ్రీ లలితా సహస్రనామాలను వినండి.

ధనుస్సురాశి ఫలాలు : పని వత్తిడి పెరుగుతుంది. కార్యాలయాలలో, ఇంట్లో మీకు చికాకులు వస్తాయి. పక్కవారితో జాగ్రత్త. విలువైన వస్తువుల విషయం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడాలి. మహిలలకు పర్వాలేదు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అర్తిక మందగమనం. వ్యాపారాలలో జాప్యం జరుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలకు సమయం కాదు. ఇంటా, బయటా మీకు చికాకుల పెరుగుతాయి. ప్రయాణ బాధలు. మహిళలకు పని భారం. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు. అందరి మన్ననలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. శుభకార్య సూచన. ఆర్థికంగా మంచి ఫలితాలు. విజయం కోసం తపిస్తారు. భవిషష్యత్‌ ప్లాన్లలన సిద్ధం చేస్తారు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు ధైర్యంగా చేస్తారు. వివాదాలను పరిస్కరించుకుంటారు. ధన సంబంధ విషయాలలో జాప్యం జరిగినా లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగం అనుకూలం. క్షేత్రాలను సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి