Health Benefits : నీలి రంగులో ఉండే శంఖు పుష్పం గురించి తెలియను వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఒక్కరి ఇంట్లోని పెరట్లో కనిపించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో మెండుగా టానిన్లు, గ్లూకోజ్ లు ఉంటాయి. ఇది బ్రెయిన్ టానిక్ గా సాంప్రదాయ వైద్య వ్యవస్థలో విస్త్తంగా ఉపయోగించబడుతుంది. ఆయుర్వేదంలో పవిత్రమైన లేదా వైద్యానికి పని చేసే మొక్క శంఖు పుష్పం. అయితే సాదారణంగా సీతాకోక చిలుకలు, బ్లూ బఠానీ, కార్డోఫాన్ బఠఆనీ మరియు ఆసియా పావురం రెక్కలు అని మొక్కను పిలుస్తారు. ఇది ఫ్యాబేసి కుంటుంబానికి చెందిన మొక్క. ఈ వైన్ మానవ స్త్రీ జననేంద్రియాల ఆకారాన్ని కల్గి ఉంటుంది. అయితే ఈ మొక్కకు క్లిటోరిస్ నుండి క్లిటోరియా జాతికి చెందిన లాటిన్ పేరు వచ్చింది.
ఇది ఆయుర్వేద సాంప్రదాయ ఔషధంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.శంఖు పుష్పం మొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాంజియోలైటిక్, యాంటీ కన్వల్సెంట్, ప్రశాంతత మరియు మత్తు మందు వంటి వివిధ లక్షణాలను కల్గి ఉంటుంది. దీని ఔషధ విలువలు చాలా ఉన్నాయి. దీని ఆకులు, పువ్వులను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే శంఖు పుష్ఫం మొక్క యొక్క ఆకులను పొడి చేసి మెదడు రుగ్మతలకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఈ మొక్కలోని పువ్వులో యాంటీ ఫంగల్ ప్రోటీన్లు, ఫైటోకెమికల్ పదార్థాలు ఉంటాయి. ఇలాగే ఇది వంధ్యత్వం, గోనేరియా వంటి లైంగిక రుగ్మతలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
ఆయుర్వేదంలో ఈ మొక్క యొక్క ఆకులు, మూలాలు, పువ్వులు అనేక సాంప్రదాయ పురాతన మూలికా ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దీని ఆకలను పొడి చేసి మెదడు సమస్యలకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఆచారాలు మరియు పూజల కోసం దేవాలయాల్లో ఈ పూలను వాడుతుంటారు. ఈ పూలను మరిగించి టీలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ పూలను నీటిలో మరిగించి వడకట్టి తాగాలి. ఇందులో నచ్చితే తేనె కూడా కలుపుకోవచ్చు. లేదంటే అలాగే కూడా తినొచ్చు. అయితే బంగారం లాంటి ఈ శంఖు చక్రం గురించి తెలుసుకున్నారు కదా.. ఇక మీరు ఓ సారి దీన్ని తిని ఆరోగ్యాన్ని పెంచుకోండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.