Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య అందరిని బాధపెడుతుంది. దీనికి కారణం వాతావరణ కాలుష్యం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, మానసిక ఆందోళన, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత ఇలా పలు కారణాల వలన జుట్టు రాలి పోవడం జరుగుతుంది. జుట్టు పెరగడానికి పై పైన ఏమి పూసిన ప్రయోజనం ఉండదు. జుట్టుకు కావలసిన పోషకాలు అందించాలి. బాడీలో విటమిన్ల లోపం, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను తగ్గడానికి జాగ్రత్తలు తీసుకుంటూ హెయిర్ ప్యాక్స్ ఆయిల్స్ ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా కలబంద మట్టను తీసుకొని శుభ్రంగా కడిగి పై ఫీల్ మొత్తం తీసేసి జెల్ మాత్రమే ఒక కప్పు తీసుకోవాలి.
కలబంద జుట్టుని సున్నితంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఒక కప్పు మునగాకు తీసుకోవాలి. మునగాకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికికలబంద సహాయపడుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి. పెరుగు జుట్టును మాయిశ్చరైజ్ చేసి చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. తర్వాత ఇందులో ఒక గుడ్డు వేసుకోవాలి. గుడ్డు జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ అందిస్తుంది. గుడ్డు వాసన పడదు అనుకున్న వారు గుడ్డుకు బదులుగా మందార పొడి వేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మిక్సీ పట్టిన వెంటనే నురగ లాగా ఉంటుంది. ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా పలుచగా ఉంది అనుకుంటే మెంతి పొడి లేదా మందారపొడి వేసి కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటే బాగా పని చేస్తుంది. ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అరగంట సేపు ఉండి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చివర్లు చిట్లడం, డామేజ్ హెయిర్, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వలన జుట్టు విపరీతంగా పెరుగుతుంది.
Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల…
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో…
Nagababu : ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్…
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత…
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి 28 వరకు భారీ…
Eknath Shinde : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర…
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం…
Smartphone : డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం మరియు సమాచార…
This website uses cookies.