Date Seed Coffee : ఖర్జూరాలను తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ ఖర్జూరాలను తీసుకోవటం వలన మన శరీరానికి అవసరమైన ఐరన్ మరియు మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఖర్జూరంలో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ వలన మన శరీరానికి అవసరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాగే మనం నీరసంగా ఉన్నప్పుడు ఒక ఖర్జూరం తిన్నా మన శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాంటి ఖర్జూర విత్తనాలతో మనం కాఫీ తయారుచేసుకొని తీసుకుంటే కలిగే లాభాలు చాలా ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ ఖర్జూర విత్తనాలతో కాఫీ పొడిని తయారు చేసుకునే ముందు ఖర్జూరం విత్తనాలను తీసుకోవాలి. వాటిని కాస్త కచ్చ పచ్చగా దంచుకొని సన్నని మంటపై వేయించాలి. ఆ విత్తనాలను సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను చల్లార్చుకోవాలి. చల్లార్చిన ఆ విత్తనాలను మిక్సీ గ్రైండ్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీంతో ఖర్జూర విత్తనాల కాఫీ పౌడర్ తయారవుతుంది.
సాధారణ కాఫీ మరియు టీ పొడి కి బదులుగా ఖర్జూర విత్తనాల కాఫీ పౌడర్ ను వాడొచ్చు. అలాగే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఖర్జూర విత్తనాలతో తయారు చేసినటువంటి కాఫీ ని తీసుకోవడం వలన బరువు తగ్గటంతో పాటుగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. అలాగే శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఈ విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్నవారికి కూడా ఈ కాఫీ తాగడం వలన సమస్య తొందరగా తగ్గుతుంది. అంతేకాక డయాబెటిస్ ను తగ్గించడంలో కూడా ఈ విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి.
ఖర్జూర విత్తనాలు తయారు చేసిన కాఫీ ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఖర్జూర గింజల పొడిలో ఒలేయిక్ ఆమ్లం మరియు ఫైబర్, ఫాలి ఫైనల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఈ ఖర్జూర గింజలలో యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డియాక్టివేషన్ చేయడంలో చాలా బాగా పని చేస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు ఈ ఖర్జూర పొడిని ఆహారంలో భాగం చేసుకోవటం వలన పొట్టలో ఫైబర్ పరిమాణం పెరుగుతుంది. ఇది పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యల నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.