Date Seed Coffee : ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే… ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Date Seed Coffee : ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే… ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :6 November 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Date Seed Coffee : ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే... ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం...!!

Date Seed Coffee : ఖర్జూరాలను తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ ఖర్జూరాలను తీసుకోవటం వలన మన శరీరానికి అవసరమైన ఐరన్ మరియు మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఖర్జూరంలో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ వలన మన శరీరానికి అవసరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాగే మనం నీరసంగా ఉన్నప్పుడు ఒక ఖర్జూరం తిన్నా మన శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాంటి ఖర్జూర విత్తనాలతో మనం కాఫీ తయారుచేసుకొని తీసుకుంటే కలిగే లాభాలు చాలా ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ ఖర్జూర విత్తనాలతో కాఫీ పొడిని తయారు చేసుకునే ముందు ఖర్జూరం విత్తనాలను తీసుకోవాలి. వాటిని కాస్త కచ్చ పచ్చగా దంచుకొని సన్నని మంటపై వేయించాలి. ఆ విత్తనాలను సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను చల్లార్చుకోవాలి. చల్లార్చిన ఆ విత్తనాలను మిక్సీ గ్రైండ్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీంతో ఖర్జూర విత్తనాల కాఫీ పౌడర్ తయారవుతుంది.

సాధారణ కాఫీ మరియు టీ పొడి కి బదులుగా ఖర్జూర విత్తనాల కాఫీ పౌడర్ ను వాడొచ్చు. అలాగే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఖర్జూర విత్తనాలతో తయారు చేసినటువంటి కాఫీ ని తీసుకోవడం వలన బరువు తగ్గటంతో పాటుగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. అలాగే శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఈ విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్నవారికి కూడా ఈ కాఫీ తాగడం వలన సమస్య తొందరగా తగ్గుతుంది. అంతేకాక డయాబెటిస్ ను తగ్గించడంలో కూడా ఈ విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి.

Date Seed Coffee ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం

Date Seed Coffee : ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే… ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం…!!

ఖర్జూర విత్తనాలు తయారు చేసిన కాఫీ ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఖర్జూర గింజల పొడిలో ఒలేయిక్ ఆమ్లం మరియు ఫైబర్, ఫాలి ఫైనల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఈ ఖర్జూర గింజలలో యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డియాక్టివేషన్ చేయడంలో చాలా బాగా పని చేస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు ఈ ఖర్జూర పొడిని ఆహారంలో భాగం చేసుకోవటం వలన పొట్టలో ఫైబర్ పరిమాణం పెరుగుతుంది. ఇది పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యల నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది