Health Benefits : సుగంధ పాల వేర్లు అనే పేరు ను మీరు ఎప్పుడైనా విన్నారా. వీటి ఉపయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేయటంలో ఈ సుగంధ పాల మొక్క ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. అంతేకాక శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు ఎన్నో ఇతర ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక సుగంధ పాల మొక్క వేరు చక్కని సువాసన కూడా కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా క్లీన్ చేసి నీటిలో మరిగించగా వచ్చిన ఎర్రని కషాయాన్ని తాగడం వలన శరీరానికి ఎంతో బలం వస్తుంది. ఈ సుగంధ పాల పేర్లను ఆయుర్వేద షాపులలో అమ్ముతూ ఉంటారు. ఇవి ఎన్నో రకాలుగా దొరుకుతాయి. ఒకటి నల్ల సుగంధి, ఇంకొకటి ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా ఎంన్నో రకాలుగా లభిస్తాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. అలాగే శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా కూడా పోయి చలువ చేస్తుంది. అలాగే ఎక్కువ వేడితో బాధపడుతున్న వారు కూడా ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితం దక్కుతుంది. అధిక వేడి వలన కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా చూస్తుంది. ఈ సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ సుగంధి పాల వేర్ల లా కషాయాన్ని తీసుకోవడం వలన ఆకలి అనేది కూడా పెరుగుతుంది. అంతేకాక జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తీసుకున్నట్లయితే జ్వరం కూడా తొందరగా తగ్గుతుంది…
ఈ సుగంధి పాల మొక్క వేర్ల ను కడిగి డైరెక్ట్ గా నోట్లో వేసుకొని నమిలి ఆ రసాన్ని మింగవచ్చు. ఈ సుగందీ పాల మొక్క వేరు కషాయం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే శరీరంలో ఉండే మలినాలు కూడా తొలగిపోతాయి. అంతేకాక చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎంతో కాంతివంతంగా కూడా మెరుస్తుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది. ఈ సుగంధితో చేసినటువంటి కషాయాన్ని తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఉంటారు. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన రక్తం కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది. శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. అలాగే జీర్ణశక్తి ఎంతో మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధక సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ కాషాయం తీసుకోవడం వలన మూత్రశయం ఇన్ఫెక్షన్ లు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఈ విధంగా సుగంధ వేర్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఈ సుగంధి వేర్లను వాడడం వల్ల ఎన్నో రకాలు గా మనకు మేలు జరుగుతుంది అని ఆయుర్వేద నిపుణులు కూడా అంటున్నారు…
ఈ వేర్లతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కషాయం తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు ఏమిటి అంటే. ఈ కషాయం తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సుగంధ వేర్ల తో కషాయం తయారు చేసుకోవడానికి మనం నాలుగు లేక ఐదు గ్రాముల సుగంధ వేర్ల పొడి మరియు నాలుగు మిరియాలు మరియు రెండు యాలకులు ఒక చిన్న అల్లం ముక్క 10 పుదీనా ఆకులను వాడాల్సి ఉంటుంది. అయితే ముందు ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసుకొని దీనిలో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. తర్వాత మరిగిన నీళ్లను వడకట్టి దానిలో పుదీనా ఆకులు మరియు తేనే వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు లేక మూడు సార్లు తాగడం వలన చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా ఎంతగానో పెరుగుతుంది…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.