Home » Health » Health Benefits This Fruit
Health

Health Benefits : ఈ పండుని సామాన్యుడు కొనలేడు… ప్రపంచంలోనే ఎంతో ఖరీదైనది.. కానీ దీని ప్రయోజనాలు బోలెడన్ని.. ఏమిటది…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 25, 2025, 9:00 am
Advertisement

Health Benefits : కొన్ని సీజన్లలో వచ్చే పండ్లను తప్పనిసరిగా తినాలి. ఆ సీజన్ వెళ్ళిపోతే మళ్ళీ ఏడాది వరకు మనకు ఆ పండు లభించదు. కాబట్టి ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు అందుతాయి. ఒక్కో పండులో ఒక్కో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇలాంటి సీజన్లో లభించే ప్రతి ఇంట్లోనూ పుచ్చకాయ, తర్బూజా ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటారు ప్రజలు. అలాంటి పండు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. ఈ పండుని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగ పేరుగాంచింది. ఇది సామాన్యుడు కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉన్నది. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టవచ్చు. ఈ పండు జపాన్లో మాత్రమే దొరుకుతుంది. ఈ పుచ్చకాయను జపనీస్ పుచ్చకాయ లేదా యుబారీ కింగ్ పేరుతో కూడా పిలుస్తారు. అయితే,ఈ పండు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం…

Advertisement

Health Benefits : ఈ పండుని సామాన్యుడు కొనలేడు… ప్రపంచంలోనే ఎంతో ఖరీదైనది.. కానీ దీని ప్రయోజనాలు బోలెడన్ని.. ఏమిటది…?

ఈ ఖరీదైన పుచ్చకాయ హో ఖైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు. దీని ద్వారా అనేక వేల డాలర్లు. ఈ పండు ముఖ్యంగా తీపి, రుచి, తక్కువ గింజలు, ఘాటైన సువాసనతో నిండి ఉంటుంది.  వారికింగు పుచ్చకాయ గుండ్రంగానూ, ను నునిపైన చర్మంతో ఉంటుంది. లోపల గుజ్జు నారింజరంగులో ఉండి చాలా తీపిగా ఉంటుంది. దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పండును చుగెన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు. పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే,దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఈరోజు ఈ పండును శుభ్రం చేస్తారు. ఈ పుచ్చకాయలో 1.5 నుండి 2 కిలోల బరువు వరకు ఉంటాయి. వారికింగు పుచ్చకాయను కంటాలఫ్, బర్ఫీస్ స్పైసి కాంటాలాఫ్ నే రెండు రకాల పుచ్చకాయల మిశ్రమం ద్వారా తయారు చేస్తారు. ఈ యువారీ పుచ్చకాయలు జూన్ నుండి ఆగస్టు మొదటి వారం వరకు మాత్రమే దొరుకుతాయి.

Advertisement

2018 వ సంవత్సరంలో రెండు యుబారి కింగ్ పుచ్చకాయలు 3.2 మిలియన్ల జపనీస్ యెన్లకు అమ్ముడు అయ్యాయి. 2019లో ఒక జత యువారికింగ్ మెలోన్ 46, 500 డాలర్లకు ( సుమారు 35 లక్షల రూపాయలు) అమ్ముడయ్యాయి. పండు ప్రత్యేకత,చాలా రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, బాశ్వరం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. పండు అధిక ధరగా ఉండుట చేత సామాన్యులు తినే తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని. కొనాలనుకునే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి