Periods Pain : పిరియడ్స్ అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. అయితే కొంత మందిలో విపరీతమైన కడుపునొప్పి కూడా వస్తుంది. అయితే పీరియడ్స్ లో వచ్చే నొప్పిని భరించటం అనేది చాలా కష్టం. అయితే ఈ నొప్పిని భరించలేక ఎంతో మంది మందులు కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ వీటితో ఎన్నో దుష్ఫలితాలు ఉన్నాయి అనే సంగతి ఎవరికీ తెలియదు. అయితే ఈ నొప్పిని నియంత్రించడానికి ఇంట్లోనే ఎలాంటి చిట్కాలు ట్రై చేయాలి.? అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది.? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పీరియడ్స్ నొప్పి అనేది చాలా నరకంగా ఉంటుంది. ఈ నొప్పిని నియంత్రించడంలో ఎండుద్రాక్ష నీళ్లు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే పిరియడ్స్ మొదలవుతాయి అనగా రెండు రోజుల ముందు నుండే ఈ ఎండు ద్రాక్ష నీటిని తాగటం ప్రారంభించాలి. ఇవి పొత్తికడుపులో వచ్చే నొప్పిని మరియు తిమ్మిరి, నడుము నొప్పిని కూడా నియంత్రిస్తాయి. అలాగే నెలసరిలో తినే ఆహారం కూడా చాలా అవసరం. అయితే నొప్పి వస్తుంది కదా అని వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోవడం అంత మంచిది కాదు. వీటిని వేసుకోవటం కంటే ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ను తాగితే చాలా మంచిది. అదే విధంగా మొలకెత్తినటువంటి గింజలు తీసుకోవడం వలన కూడా నొప్పి అనేది తొందరగా తగ్గుతుంది.
మీకు కూడా నెలసరి ప్రారంభం అయ్యే ముందే నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి. వీటిలలో క్యారెట్ మరియు చిలకడదుంప, దానిమ్మ, యాపిల్ లాంటివి తింటే నొప్పి రాకుండానే ముందుగా జాగ్రత్త పడొచ్చు. అలాగే గోరువెచ్చని నీటిని కూడా తాగుతూ ఉండాలి. ఇవి మాత్రమే కాక పచ్చి ఉల్లిపాయను తీసుకొని దాని నుండి రసాన్ని తీయాలి. దీనిలో కొద్దిగా తేనే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రెండుసార్లు తీసుకుంటే చాలా మంచిది. ఇది పీరియడ్స్ నొప్పిని వెంటనే నియంత్రిస్తుంది. అంతేకాక గర్భాశయ కండరాలు కూడా సడలిస్తాయి
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.