Home » Health » Presvu Eye Drops Eliminates The Reading Glasses
Health

Eye Drops : చత్వార సమస్య కు చుక్కల మందుతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 8, 2024, 8:00 am
Advertisement

Eye Drops : ప్రతి ఒక్కరికి 40 సంవత్సరాలు దాటగానే చత్వారం అనేది వస్తూ ఉంటుంది. దీంతో పుస్తకాలు చదవడానికి కళ్ళజోడు చాలా అవసరం. దీనిని ప్రెస్ బయోపియా అని అంటారు. అయితే చత్వారం ఉన్నవారికి కళ్ళజోడు తో ఏ మాత్రం పని లేకుండా చుక్కల మందు ఒకటి అక్టోబర్ లో అందుబాటులోకి రాబోతుంది. అయితే ముంబైకి చెందినటువంటి ఎన్ టోడ్ ఫార్మా కంపెనీ ప్రెస్ వూ అభివృద్ధి చెందినటువంటి ఈ చుక్కల మందుకి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే ఈ మందును అక్టోబర్ మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆ సంస్థ తెలిపింది. అయితే 42నుండి 55 సంవత్సరాలు దాటిన వారిలో కొద్దిపాటి నుండి ఒక మోస్తరు చత్వారంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మందును గనుక మీ కంట్లో ఒక చుక్క వేసుకుంటే 15 నిమిషాలలోనే పనిచేయడం మొదలు పెడుతుంది అని ఆ సంస్థ సీఈవో నిఖిల్ తెలిపారు…

Advertisement

అయితే ఈ చుక్కల మందును కంటిలో ఒక చుక్క వేస్తే 6 గంటల దాకా, రెండు చుక్కలు వేసుకుంటే ఎక్కువ సమయం పని చేస్తుంది అని ఆయన తెలిపారు. అయితే ఈ చుక్కల మందు ధర వచ్చి రూ. 350. నిజం చెప్పాలంటే అమెరికాలో వ్యూటీ పేరుతో 2022లో దీనికి సంబంధించిన చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రేస్ వూ మన దేశంలో తయారు అయినటువంటి మొట్టమొదటి ఫ్రెష్బియోపియా చుక్కల మందు కావటం ఒక విశేషం అని చెప్పాలి. అయితే ఈ చుక్కల మందు అనేది మన కన్నీటి యొక్క పీహెచ్ విలువకు తగినట్టుగా వేగంగా తనకు తానే సర్దుబాటు చేసుకుంటుంది అని అన్నారు. కావున ఈ మందును ఎక్కువ కాలం పాటు వాడిన కూడా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అని ఆయన తెలిపారు…

Eye Drops : చత్వార సమస్య కు చుక్కల మందుతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!

Advertisement

అయితే ఈ డ్రాప్స్ తయారీలో పైరో కార్బన్ మరియు మాలిక్యుల్ వాడినట్లు తెలిపారు. అలాగే అమెరికాలో సెప్సిస్ సమస్యకు దీనిని ఎంతో కాలంగా వాడుతున్నారు అని తెలిపారు. కానీ నిజానికి దీనిని ఎక్కువకాలం వాడటం అంత మంచిది కాదు కావున ఈ చుక్కల మందు యొక్క గాఢతను తగ్గించి కన్నీటి యొక్క పీహెచ్ విలువలకు దాదాపు దగ్గరగా తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఈ చుక్కలను కంటిలో వేయగానే దానిలో ఉన్న ఔషధం కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తుంది అని దీంతో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది పెరిగి కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది అని ఆయన తెలిపారు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి