Home » Health » Quick Relief From Joint Pains Tips In Telugu
Health

Joint Pains : 10 రోజులు తాగితే చాలు.. మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: December 20, 2023 10:28 am
Advertisement

Joint Pains : తీసుకున్న ఆహారం అరగడానికి కనీసం మూడు గంటలైనా పడుతుంది. మరి ఈ మూడు గంటల్లో మనం ఆకలి వేసినప్పుడు ఏం చేస్తున్నాం.. అదే పనిగా ఏదో ఒకటి తింటూనే ఉంటున్నాం కదా… మరి అలాంటప్పుడు మన పొట్ట ఎలా శుభ్రంగా ఉంటుంది చెప్పండి.. ఎలా అరుగుదల శక్తి బాగుంటుంది…మన అరుగుదల శక్తి చక్కగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఈరోజు మీకు చెప్పబోతున్నాను అది కూడా మీ చేతులతో మీరు స్వయంగా ఈజీగా తయారు చేసుకునే ఫుడ్ రెసిపీ ఇది. నిజానికి రెసిపీ అనేకంటే కూడా ఒక సింపుల్ టిప్పింది. ఈ టిప్ కనుక మీరు పాటిస్తే మీకు నచ్చిన ఫుడ్డు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఉదయాన్నే చద్దనమని తింటూ ఉంటారు. అంటే మనం తయారు చేసుకున్నట్టు పాలు పెరుగు ఇవేమీ వేసుకోకుండా కేవలం రాత్రి మిగిలిన అన్నం వేసి రాత్రంతా వాటిని అలా పులిస్తారు. ఉదయాన్నే ఆ గంజితో పాటు అన్నాన్ని ఉప్పు వేసుకుని వారికి నచ్చిన ఏదైనా పికిల్ గాని లేకపోతే ఆనియన్ గాని నంచుకుని వారికి సరిపడా ఆహారాన్ని తింటూ ఉంటారు. వారి రోజును అలాగే ప్రారంభిస్తారు.

Advertisement

నిజంగా వారు పొట్ట ఎంత కూల్ గా ఉంటుందంటే వారు మధ్యాహ్నం చేసే వరకు కూడా వారికి ఆకలి అనిపించదు. అలాగే పొట్ట వేడి చేయడం గాని లేకపోతే శరీరం వేడిగా ఉండి డిహైడ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండవు. అయితే ఈరోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ ఎంత తెలుపుగా ఉంటున్నాయో చూస్తునంగా.. అలాంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. మరి మనం గంజి వేటుతో తయారు చేసుకుంటే మంచిది అని గనుక ఆలోచిస్తే ఎన్నో రకాల రోగాలను నయం చేయగల శక్తి కలిగినవి చిరుధాన్యాలు ఈ మధ్య చాలామందికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. కాబట్టి ప్రిపేర్ చేసుకుని తాగడం కూడా చేస్తున్నారు.. దీని వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. రకరకాల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాదు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు కంటి సంబంధిత సమస్యలు ఇలా ఒకటి కాదు చాలా రకాల రోగాలు నయం చేయగల శక్తి ఉంది ఈ చిరుధాన్యాలకి.. మరి వీటితో తయారు చేసుకున్న గెంజి వల్ల ఇంకెన్ని ప్రయోజనాలు ఉంటాయో ఊహించండి. ఈ గంజిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ముందుగా ఒక మట్టి పాత్రలో ఒక లోటాడు వరకు సిరి ధాన్యాలు తీసుకుని మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పి ఆపేయండి. ఇలా చేయడం వల్ల సగం నూక గాను సగం పిండిగాను ఉంటుంది.

కాబట్టి గంజి తాగడానికి అనువుగాను రుచిగానే ఉంటుంది. ముందుగా పెట్టిన శుభ్రంగా కడిగేసి ఆ నీటిని ఇందులో ఒక10 లోటాలు నీరు వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలా ఉంచండి. ఇలా రాత్రంతా నానిన సిరి ధాన్యాలను ఉదయం సంఘటీని మంట మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గంజి రెడీ అయిపోతుంది. దీని వెంటనే మనం తాగకూడదు. దీన్ని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుందీ.. ఇలా ఉదయం ఈ గంజి తాగాలి అనుకుంటే రాత్రంతా పులియపెట్టి ఉదయాన్నే తాగొచ్చు. ఒకవేళ మీరు సాయంత్రం తాగాలి అనుకుంటే సాయంత్రం వరకు పులియపెట్టి సాయంత్రం తాగొచ్చు. ఇలాగ తాగితే దాంతో నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి రోగాలకైనా చెక్ పెట్టవచ్చు..

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి