Rice Roti : ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని, స్లిమ్ గా ఉండాలని, అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే అధిక బరువు పెరగటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. వెయిట్ తగ్గాలని ఎన్నో రకాల డైట్స్ ను ఫాలో అవుతుంటారు. అలాంటి డైట్ లో రైసు లేదా చపాతి ఈ రెండిట్లో ఏది తింటే బరువు తగ్గుతారు అనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం… అధిక బరువు తగ్గాలంటే మనం తినే ఆహార పదార్థంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేటట్లు తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మన ఇండియన్ కల్చర్ లో భోజనం చేసే సమయంలో రైస్ తో పాటు రోటీలు కూడా ఉండాల్సిందే… కానీ అందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మరి బరువు తగ్గేదెలా అని అనుకుంటున్నారా..?
అధిక బరువు తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రి సమయంలో తేలికపాటి భోజనాన్ని తీసుకోవాలి. అంతేకానీ ఫుల్ గా భోజనం తిని బరువు తగ్గాలంటే తగ్గరు. రోజు అన్నం తినగానే పడుకోకూడదు. డైలీ వాకింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక డౌట్ ఉంది. అది ఏమిటంటే రైస్, రోటి ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే… వరి అన్నంలో అతి తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. అలాగే 120 గ్రాముల గోధుమలలో 190 ఎం.జి సోడియం ఉంటుంది. క్యాలరీలు, ఒక గ్రామ్ ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చపాతి గోధుమల నుండి తయారు చేస్తారు కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
ఒక చిన్న 6 అంగుళాల చపాతీలో దాదాపు 71 కేలరీలు, మూడు గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాములకు కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలతో పోలిస్తే ఊరిలో మెగ్నీషియం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బియ్యం గోధుమలు రెండు ఒకే పరిమాణంలో ఫోలేట్, ఐరన్ కలిగి ఉంటాయి. చపాతి మరియు అన్నం రెండు సొంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బియ్యం పప్పు కలిసి అందులో అన్ని అమైనొ ఆమ్లాలు ఉంటాయి. జొన్న,బార్లీ, వేలు లేదా ముత్యాల మిల్లెట్ తో చేసిన రోటీ వల్ల క్యాల్షియం, ఫాస్పరస్, జింకు వంటి పోషకాలు మీకు అందుతాయి. ఈ రెండు ఆరోగ్యానికి మంచివే కాబట్టి.. ఒకరోజు రైసు, ఒకరోజు రోటి తింటే బరువు త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పోర్షన్ సైజ్ ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. రాత్రి సమయంలో 8 గంటలలోపే డిన్నర్ చేసేయాలి. లేటుగా భోజనం చేయడం వలన అనారోగ్య సమస్యల బారిన పడతాము. కావున మనము ప్రతిరోజు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. టైం ప్రకారం భోజనం చేయాలి. టైం ప్రకారం నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో పాటించడం సాధ్యం కావడం లేదు. అందుకే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కావున వీలైనంతవరకు ఉన్న టైంలో నైనా టైం ప్రకారం ఎంత పని ఉన్నా సరే మర్చిపోవద్దు. ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం.
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
This website uses cookies.