Categories: HealthNews

Salt : ఉప్పును తక్కువగా తీసుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…!

Salt  : ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాగని తక్కువ పరిమాణంలో తీసుకుంటే కూడా ప్రమాదమే. అయితే ఈ రోజుల్లో అధిక రక్తపోటు మరియు మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు వాటిని నివారించడానికి తక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్న మాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం సోడియం ఉప్పు అనేది ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ . ఇది కణాలలోని నీటి యొక్క పరిమాణాన్ని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రక్తంలో సోడియం తక్కువ అయినట్లయితే హైపోనట్రేమియా సంభవిస్తుందట. దీని కారణంగా శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Salt : రక్తంలో సోడియం ఎంత ఉంటే మంచిది…

నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం రక్తంలో సోడియం లీటర్ కు 135 నుండి 145 మిల్లీక్వివలెంట్లు ఉండాలట. ఇక 135 mEq/L కంటి తక్కువ స్థాయిలో రక్తంలో సోడియం లోపం ప్రారంభమవుతుంది. ఇక ఈ సమస్య శరీరంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కావున వెంటనే దీనిపై చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Salt  : సోడియం లోపిస్తే ఏమవుతుంది…

రక్తంలో సోడియం లోపించటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఆందోళన ఒత్తిడి లేదా నరాల సంబంధిత సమస్యలు రావచ్చు. అంతేకాక ఆయాసం తలనొప్పి వాంతులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కండరాల తిమ్మిరి కూడా సోడియం లోపానికి సంకేతమని చెప్పొచ్చు.

Salt  లక్షణాలు….

రక్తంలో సోడియం లోపం అనేది అనేక రకాల కారణాల వలన వస్తుంది. అయితే ఉప్పు తక్కువగా తీసుకునే వారిలో ఇది లోపం కావచ్చు. అలాగే శరీరంలో అధిక నీరు ఎలక్ట్రోలైట్స్ కోల్పోయే వారు కూడా సోడియం లోపంతో బాధపడతారు. అంతేకాక ఈ సమస్య అధిక సారం , వాంతులు, యాంటీ డిప్రెసెంట్ మందుల వలన కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఈ సోడియం లోపం అనేది మనకు రక్తంలో కనిపిస్తుంది. దీని వలన శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇక దీనిని నివారించడానికి ద్రవరూపంలో ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవడం మానేయాలి.అలాగే ఉప్పును తగిన పరిమాణంలో తీసుకోవాలి. తక్కువగా తీసుకున్నట్లయితే గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాక ప్రతిరోజు 3000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకున్న వారిలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Salt : ఉప్పును తక్కువగా తీసుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…!

Salt  సోడియం లోపం అధిగమించడం ఎలా…

మీరు రక్తంలో సోడియం లోపాన్ని నివారించాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు సరిపడా సోడియం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే దానిని సరైన పరిమాణంలో తీసుకోవటం ఆరోగ్యానికి మేలును కలగజేస్తుంది. అయితే తాజాగా ఓ అధ్యయనాలలో వెల్లడించిన నివేదిక ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గ్రాముల ఉప్పు తినాలి. తద్వారా మీరు సోడియం లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు. అలాగని ఉప్పు మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే అది రక్తపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

Recent Posts

Karakkya Benefits : మొత్తం శరీర భాగాలను రిపేర్ చేసే… ఒకే ఒక్క పండు.. 160 వ్యాధులకు చెక్…?

Karakkya Benefits : కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయుర్వేదంలో విశేష…

33 minutes ago

Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?

Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…

2 hours ago

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

10 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

11 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

12 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

12 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

14 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

15 hours ago