Sapodilla Benefits : సపోటా మజాకా.. ఎండాకాలంలో దీని బెనిఫిట్స్ తెలిస్తే వదలనే వదలదు...?
Sapodilla Benefits : సపోటా పండు, ఈ పండు మనందరికీ తెలుసు. ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అసలు ఈ సపోటాలు మన భారత్ కి చెందిన పండ్లు కావు. మధ్య అమెరికా, మెక్సికోకు చెందిన ఉష్ణ మండల ప్రాంతాల్లో పండే పండు. ఇవి మన దేశంలో కూడా పండిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ఇది ఎక్కువగా దొరుకుతున్నాయి. కోందరు ఈ పండ్లను అసలు ఇష్టపడరు. కొంతమంది మాత్రమే చూడగానే నోరూరినట్లు అవుతుంది. సపోటా ప్రియులు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడడానికి గోధుమ రంగులో ఉండి నోట్లో వేసుకోగానే ఇట్లే కరిగిపోతుంది. జూసీగా కూడా ఉంటుంది. ఈ సపోటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పండు గురించి తెలిస్తే మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. మరి దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సపోటాని ఎండాకాలంలో తింటే ఎంతో శక్తిని మన శరీరానికి అందిస్తుంది. శరీరాన్ని నిసత్తువ ఆవహించి ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటాలు అన్న తింటే శరీరం వెంటనే తక్షణ శక్తిని పొందుతుంది. నిజంగా ఈ పండు కి అంత పవర్ ఉంది. సపోటాలో పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఉష్ణ మండల ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా పెరుగుతాయి. మొట్టమొదటగా ఈ సపోటా చెప్పిన స్పానిష్ రాజులు ఫిలిప్పిన్స్ లో సపోటా తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు. సపోటాలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. ఇదే ఇందులో చెప్పుకోదగ్గ విషయం. సపోటాలు కోసిన తర్వాతనే పండుతాయి.
Sapodilla Benefits : సపోటా మజాకా.. ఎండాకాలంలో దీని బెనిఫిట్స్ తెలిస్తే వదలనే వదలదు…?
మనం రోజు తినే ఆహారంలో ఫైబర్ ను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మలబద్దకం వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. అయితే సపోటాని తీసుకుంటే ఫైబరు కావలసినంత మన శరీరానికి అందుతుంది. ఒక్క సపోటా పండులో దాదాపు తొమ్మిది గ్రాముల ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నీరసం అలసటకు రామబాణం : ఈ సపోటా పండ్లు ఎక్కువగా వేసవికాలంలోనే మనకి కనబడుతుంటాయి. ఎండాకాలంలో శరీరం డిహైడ్రెషన్ కు గురవుతుంది. అప్పుడు అధిక ఉష్ణోగ్రతతో నీరసం, నిసత్వకు గురవుతుంది. ఇటువంటి సమయంలో రెండు సపోటాలు తిన్నారంటే ఇక వెంటనే తక్షణ శక్తిని పొందుతారు.
జీర్ణ సంబంధిత సమస్యలు : ఎవరికైనా జీర్ణ సంబంధించిన సమస్యలు ఉంటే గనక ఈ సపోటా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో టానిన్లు, పాలిఫైనల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం : సపోటాలో పొటాషియం ఉంటుంది కాబట్టి రక్తపోటును నియంత్రించవచ్చు. దీనివల్ల నాకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ సపోటాలో డైటరీ ఫైబర్, ఆక్సిడెంట్ లో రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎక్కువగా తిన్నారంటే ఇక అంతే : సపోటాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇంకా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలాగని వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం అనర్ధాలే వస్తాయి. సాపోటాలను అదే పనిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అజీర్ణ వంటి సమస్యలు మరియు పొట్ట ఉబ్బరం వంట సమస్యలు కూడా తలెత్తుతాయి. లిమిట్ గా తినాలి. అప్పుడే దీని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
This website uses cookies.