Home » Health » Summer Is Here Get Relief From Extreme Temperature Like This
Health

Summer : ఎండాకాలం వచ్చేసింది… ఉష్ణోగ్రత తీవ్రత నుంచి ఇలా రిలీఫ్ అవ్వండి.. ఏం చేయాలి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 2, 2025, 12:15 pm
Advertisement

Summer  : ఎండాకాలం వచ్చేసింది. ఇక ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఎండలు పెరగడం వలన అధిక వేడి, ఉక్క పోత, చెమటలతో తెగ ఇబ్బంది పడతారు. బయట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే, ఒంట్లో అంతే వేడి పెరుగుతుంది. దీనివల్ల అలసట, హైడ్రేషన్ సమస్యలు వస్తాయి. అయితే ఈ చిట్కాలని పాటిస్తే ఎండాకాలంలో ఒంట్లో చల్లదనం పెరిగి వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఏ ఆహార పదార్థాలు తింటే మన ఒంట్లో చల్లదనం తుందో తెలుసుకుందాం.. ఏప్రిల్,మే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మార్చి నెల నడుస్తుంది. ఎండాకాలం ఇంకా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళామంటే ఒంట్లో వేడి సెగలు కక్కి చెమటలు కారిపోతుంటాయి. ఒక్కసారి ఎండ దెబ్బకు గురైతే మాత్రం మళ్లీ కూల్ అవ్వడం కష్టమవుతుంది. ఉంటే ఉక్క పోత అనిపిస్తుంది. ఇంటికి వెళ్తే ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగులుతుంది. ఇలాంటివి సహజంగానే ఉంటాయి కానీ వీటి నుండి మనం ఎలా రిలీఫ్ అవ్వాలి అనేది తెలుసుకుందాం… ఎండలో మనం ఎక్కువసేపు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. తో శరీరంలో శక్తి చెమట రూపంలో బయటికి వెళ్లి, అలసట, నీరసం, వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శరీరాన్ని చల్లగా ఉంచాలి అంటే నీటిని ఎక్కువగా తాగాలి. ఒక్క నీరు మాత్రమే కాదు మజ్జిగ, నిమ్మరసం, అంబలి, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవాలను తాగితే ఒంట్లో తేమ తగ్గిపోతుంది.

Advertisement

Summer : ఎండాకాలం వచ్చేసింది… ఉష్ణోగ్రత తీవ్రత నుంచి ఇలా రిలీఫ్ అవ్వండి.. ఏం చేయాలి…?

ఒంట్లో వేడి ఎక్కువగా అనిపిస్తే చల్లని నీటితో ముఖం మరియు చేతులు, కాలను కడుక్కోవడం మంచిది. ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తే మెడ, నుదురు, ఛాతి వంటి ప్రాంతాల్లో ఐసు లేదా చల్లటి నీటితో తడి బట్టలు వేసుకోవచ్చు. ఎక్కువసేపు టైం గడిపి వెంటనే శరీరాన్ని చల్లబరుచుకోకూడదు. ఎండ నుంచి ఇంటికి రాగానే వెంటనే వాటర్ తాగొద్దు. సేపటి తరువాత తాగాలి. అలాగే స్నానం కూడా వెంటనే చేయవద్దు. ఇంతసేపటికి చేయాలి. ఎండాకాలంలో ఎక్కువగా చమటలు పడితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వాటి ఆహార పదార్థాలలో శరీరాన్ని వేడిని పెంచే మసాలా ఫుడ్స్, స్పైసి ఐటమ్స్ తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తేలికపాటి ఆహారాలను, నీరు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. ఫ్రై ఫుడ్ అంటే పొడిబారిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో చాలామంది కూడా శరీర శ్రమ కష్టం అనిపిస్తుంది. పూర్తిగా వ్యాయామాన్ని మానేయొద్దు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ మరియు యోగా లాంటివి చేస్తే ఒంట్లో వేడి ఇట్లే తగ్గిపోతుంది. కానీ ఎక్కువ భారం అనిపిస్తే మాత్రం ఎక్సైజ్ లు తగ్గిస్తే మంచిది.

Advertisement

ఇంకా ఎండాకాలంలో దుస్తులు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఒంట్లో వేడి తగ్గాలంటే వదులుగా ఉండే లేదా గాలి ఆడే బట్టలను ధరించాలి. కాటన్, లెనిన్ లాంటి సహజమైన ఫ్యాబ్రిక్ బెస్ట్ ఆప్షన్, నైలాన్ పాలిస్టర్ లాంటి సింథటిక్ బట్టలను చెమటను ఎక్కువ గ్రహించి అసౌకర్యంగా అనిపిస్తాయి. వీటిని పూర్తిగా నిషేధించాలి. మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఎక్కువ నీటిని తాగాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం తగ్గించాలి, కాలంలో సరైన బట్టలను ఎంపిక చేసుకుంటే వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చిట్కాలను పాటిస్తే ఎండలో ఫ్రెష్ గా ఎనర్జిటిక్ గా ఉండొచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి