Home » News » Karthika Deepam 2 March 11th 2026 Wednesday Episode
News

Karthika Deepam 2 March 11th 2026 Episode : జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. హాస్పిటల్ లో దీపకు షాక్, అడ్డంగా బుక్కైన కార్తీక్!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 11, 2026, 8:41 am
Advertisement

Karthika Deepam 2 March 11th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో మలుపుతో ఉత్కంఠగా సాగుతోంది. కార్తీక్, దీపల జీవితాల్లో జ్యోత్స్న, పారిజాతం ఆడుతున్న చెలగాటం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. మార్చి 11వ తేదీ (ఈరోజు) ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, హై-ఓల్టేజ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేయబోతోంది. ముఖ్యంగా జ్యోత్స్న వేసిన ఉచ్చులో కుటుంబం మొత్తం పడటం, దీపను హాస్పిటల్ కు తీసుకెళ్లి కార్తీక్ ను ఇరికించడం ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్ గా నిలవనున్నాయి. అసలు ఈరోజు ఎపిసోడ్ లో ఏమేం జరిగాయో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

Karthika Deepam 2 March 11th 2026 Episode : జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. హాస్పిటల్ లో దీపకు షాక్, అడ్డంగా బుక్కైన కార్తీక్!

Karthika Deepam 2 March 11th 2026 Episode తాతయ్య మనసు మార్చిన జ్యోత్స్న

ఎపిసోడ్ ప్రారంభంలో.. హాస్పిటల్ లో దీప తన కడుపులోని బిడ్డ గురించి, అత్త కాంచన గురించి ఆలోచిస్తూ తీవ్ర ఆవేదన చెందుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దీపను కార్తీక్ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ కు పెద్దాయన శివన్నారాయణ ఫోన్ చేస్తాడు. “రేపు ఉదయం నిన్ను ఒకసారి కలవాలి.. కొన్ని విషయాలు మాట్లాడాలి” అని చెప్తాడు. దాంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. అయితే, శివన్నారాయణ ఇలా ఫోన్ చేయడానికి కారణం జ్యోత్స్న. “దీప, కార్తీక్ కలిసి మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా కాంచన అత్త ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు” అంటూ జ్యోత్స్న శివన్నారాయణకు నూరిపోస్తుంది. బిడ్డ గురించి ఆందోళన చెందుతున్న కాంచనకు వాళ్ళు అన్యాయం చేస్తున్నారని, అది నిరూపించడానికి తనకో అవకాశం ఇవ్వాలని అడుగుతుంది. అయితే, శివన్నారాయణ మాత్రం దీప, కార్తీక్ లపై నమ్మకంతో.. “నువ్వు చెప్పింది అబద్ధమైతే నా పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది” అని జ్యోత్స్న, పారిజాతాలకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే జ్యోత్స్న వెనక్కి తగ్గదు. “దీపను, బావను బోనులో నిలబెడతాను” అని పారిజాతంతో శపథం చేస్తుంది.

Advertisement

Karthika Deepam 2 March 11th 2026 Episode కాంచనను రెచ్చగొట్టిన జ్యోత్స్న

జ్యోత్స్న తన తదుపరి టార్గెట్ గా కాంచనను ఎంచుకుంటుంది. కాంచన దగ్గరికి వెళ్లి కావాలనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. “నేను పనిమనిషిని అయ్యుంటే నీ కొడుకు తాళి కట్టేవాడు, నువ్వు నాకు గుడి కట్టేదానివి. వచ్చే జన్మలో పనిమనిషిగా పుట్టి నీకు కోడలిగా వస్తాను” అంటూ దీపను తీవ్రంగా అవమానిస్తుంది. ఈ మాటలకు కాంచన కోపంతో రగిలిపోయి బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న అసలు పాయింట్ కు వస్తుంది. “దీప, కార్తీక్ ఆడుతున్న నాటకం గురించి తాతకు, నాకు అనుమానం ఉంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. దీప కడుపులో బిడ్డ విషయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో నిరూపిస్తాను” అని అడుగుతుంది. దానికి కాంచన కూడా టెంప్ట్ అవుతుంది. “సరే కానీ, నా కొడుకు, కోడలు బాధపడితే మాత్రం నిన్ను ఊరుకోను” అని వార్నింగ్ ఇచ్చి మరీ జ్యోత్స్న ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

శౌర్య పేరుతో కన్నింగ్ ప్లాన్.. హాస్పిటల్ లో ట్విస్ట్

ఇక జ్యోత్స్న తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తుంది. ఉదయాన్నే దీపకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి “మీ పాప శౌర్య మెట్ల మీద నుంచి పడిపోయింది” అని అబద్ధం చెప్తాడు. కంగారుపడిన దీప, కార్తీక్ కు కాల్ చేస్తుంది. కానీ అప్పటికే శివన్నారాయణ, కార్తీక్ ను తన కారులో తీసుకెళ్తూ.. ఫోన్ లిఫ్ట్ చేయనివ్వడు. చేసేదేమీ లేక దీప కంగారుగా బయలుదేరుతుండగా, మామ శ్రీధర్ ఎదురుపడి దీపను మరో హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు. అక్కడే అసలు ట్విస్ట్! దీప వచ్చేసరికి ఆ హాస్పిటల్ లో కార్తీక్, శివన్నారాయణ, కాంచన, జ్యోత్స్న, పారిజాతం అందరూ ఉంటారు. ఇది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. వెంటనే జ్యోత్స్న ఓ డాక్టర్ ను పిలిచి దీపకు టెస్టులు చేయమని అడుగుతుంది. “వేరే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మనిషికి ఇక్కడ టెస్టులు ఏంటి?” అని కార్తీక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

Advertisement

కార్తీక్ కు కాంచన అల్టిమేటం

“నా కోడలు కడుపులోని బిడ్డకు ప్రాబ్లం ఉందని, ఇద్దరిలో ఒకరే బతుకుతారని చెప్తున్నారు. కానీ నాకు ఇద్దరూ కావాలి. అందుకే ఇక్కడ డాక్టర్ తో టెస్ట్ చేయించి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను” అని కాంచన కచ్చితంగా చెప్తుంది. కార్తీక్ ఈ టెస్టులకు ససేమిరా అంటాడు. అప్పుడు జ్యోత్స్న ఎంటర్ అయ్యి కార్తీక్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. “బావ కంగారు చూస్తుంటే, దాచిన నిజం ఏదో బయటపడుతున్నట్లు ఉంది. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా సేమ్ రిపోర్ట్ రావాలి కదా” అంటూ లాజిక్ తీస్తుంది. చివరకు కాంచన.. “అయితే నువ్వు చెప్పింది అబద్ధం అని ఒప్పుకుంటావా? లేదా టెస్టులకు ఒప్పుకుంటావా?” అని కార్తీక్ ను నిలదీస్తుంది. తనను రప్పించడానికి శౌర్యకు దెబ్బలు తగిలాయని అబద్ధం చెప్పినందుకు కార్తీక్ ఆవేశంతో రగిలిపోతాడు. డాక్టర్ దీపను టెస్టుల కోసం లోపలికి పంపడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయి భాగంలో ఏం జరగబోతోంది? దీప రిపోర్ట్స్ లో నిజం బయటపడుతుందా? జ్యోత్స్న వేసిన ఉచ్చులోంచి కార్తీక్ తన భార్యను ఎలా బయటపడేస్తాడు? అనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి