Green Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిది అని గ్రీన్ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే ఉదయం మరియు సాయంత్రం వేళలో కూడా ఈటీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ టీని తీసుకోవడం వలన బరువు తొందరగా తగ్గుతారు. అలాగే రోగనిరోధక శక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. అయితే ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ గ్రీన్ టీ నిత్యం మితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ టీ ని ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో ఐరన్ లోపం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే శరీరంలో కాల్షియం మరియు పొటాషియం లాంటి పోషకాలు కూడా అడ్డుపడతాయి. దీంతో ఎముకలు అనేవి తొందరగా బలహీనంగా తయారవుతాయి. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కావున గ్రీన్ టీని ఎక్కువగా తాగొద్దు. గ్రీన్ టీ ని ఎంతో మంది ఉదయాన్నే ఏమి తినకుండా తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వలన కొంతమందికి కడుపులో మంట అనేది వస్తుంది. దీని వల్ల కడుపులో గ్యాస్ ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే అధికంగా గ్రీన్ టీ ని తాగేవారికి నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది అని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే కెఫిన్ అనేది నిద్ర రాకుండా చేస్తుంది. అలాగే ఈ కెఫిన్ వలన వెదడుకు కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి…
ఈ గ్రీన్ టీ లో ఉన్నటువంటి టానిన్ అనేది తలనొప్పి వచ్చేలా కూడా చేస్తుంది. అలాగే ఎక్కువగా గ్రీన్ టీ తాగితే వాంతులు మరియు అధికంగా కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాక కాలెయం పై కూడా ప్రభావం చూపుతుంది. కావున ప్రతి రోజుకి ఒకటి లేఖ రెండు కప్పుల గ్రీన్ టీ ని మాత్రమే తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగినట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. అయితే ఈ గ్రీన్ టీ మొక్కలను ఫ్లోరైడ్ అధికంగా ఉండే ప్రాంతాలలో పెంచుతారు. దీనివల్ల గ్రీన్ టీ లో ఎక్కువగా ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. అయితే ఈ గ్రీన్ టీ ని అధికంగా ఎవరు తాగుతారో వారికి ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో దంతాలు మరియు ఎముకల రంగు మారి ఎంతో బలహీనంగా తయారవుతారు…
గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకునే వారికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. మరికొందరిలో ఉదర సమస్యలు కూడా వస్తాయి. అలాగే రక్తపోటు అనేది ఎక్కువగా పెరుగుతుంది. కావున ఈ గ్రీన్ టీని మితంగా మాత్రమే తీసుకోవాలి. లేకపోతే కొంతమందిలో రక్తము అనేది గడ్డ కట్టడం మొదలవుతుంది. ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలి అంటే గ్రీన్ టీ జోలికి వెళ్ళకుండా ఉండటమే చాలా మంచిది. అలాగే మందులు వాడే వారు కూడా ఈ గ్రీన్ టీ కి దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ మీరు గ్రీన్ టీ తాగాలనుకుంటే డాక్టర్ల ను సంప్రదించిన తర్వాతే తాగాలి. లేకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.