Home » Health » These Are The Foods To Take For Heart Health
Health

Heart : గుండె ఆరోగ్యం కోసం… తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 13, 2024 7:58 pm
Advertisement

Heart : మన దేశంలో గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది మరణిస్తున్నారు కూడా. అయితే టైం కు ఆహారాన్ని తీసుకోకపోవడం మరియు వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం లాంటివి గుండె పనితీరును మందగిస్తాయి. అలాగే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి వేగంగా పెరిగిపోవటం కూడా గుండె పనితీరిపే ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

Advertisement

Heart చేపలు తినాలి

సాధారణంగా చేపలను ఎక్కువగా తీసుకునే వారిలో గుండె సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని నిపునులు అంటున్నారు. అలాగే చేపల లో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అనేవి గుండె పనితీరును ఎంతో మెరుగు పరుస్తాయి.

ఆకుకూరలు : ఆకుకూరలు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇది క్యాన్సర్ లాంటి రోగాలను సైతం దరిచేరకుండా చూస్తాయి. అలాగే పాలకూర మరియు కోతిమీర, ర్యాడిస్ మొదలగు వాటిలలో కొవ్వు శాతం అనేది తక్కువగా ఉండడంతో పాటు పోలిక్ యాసిడ్,మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును బాగు చేయటంలో ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకుకూరల ను రోజు ఆహారంలో తీసుకునే వారికి మిగిలిన వారితో పోల్చినట్లయితే వీరికి గుండె సమస్యలు 11% తక్కువగా ఉంటాయి.

Advertisement

ఓట్స్ : మీరు ప్రతి నిత్యం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకుంటే గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. అలాగే వీటిలో ఉండే బ్లీటా గ్లూకాన్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. అందువలన ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవాలి.

Heart : గుండె ఆరోగ్యం కోసం… తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!

Advertisement

గోధుమలు, ధాన్యాలు, పప్పు, బీన్స్ మొదలైన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఉన్నటువంటి విటమిన్స్, ఐరన్, ఫైబర్, యాటీ ఆక్సిడెంట్ రక్త పోటును కంట్రోల్ లో ఉచ్చుతాయి. దీనితో గుండె పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా టమాటాలు, యాపిల్స్, సోయా లాంటివి కూడా రోజు తీసుకోవటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి