Liver : ఉదయాన్నే మీరు చేసే చెడు అలవాట్లే... మీ కాలేయాన్ని పాడు చేస్తాయి తెలుసా...!!
Liver : మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని విషపూరితమైన పదార్థాలను తొలగించటం తో పాటుగా రక్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. మన శరీరంలో పలు అవయవాలు, వాటి విధులు సరిగ్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనం మన రోజు వారిలో చేసే కొన్ని అలవాట్లు కాలేయానికి ఎంతో ప్రమాదకరంగా మారుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఉదయాన్నే చేసే చెడు అలవాట్లు కాలేయానికి హాని కలిగిస్తాయి అని అంటున్నారు వైద్య నిపుణులు. ఒకవేళ కాలేయం గనుక పాడైతే మధుమేహ లాంటి ఎన్నో రకాల ప్రమాదకర వ్యాధులు పెరుగుతాయి. అలాంటి కొన్ని తప్పులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నీరు త్రాగకుండా రోజును ప్రారంభించడం : ఉదయాన్నే నీరు త్రాగటం చాలా అవసరం. కానీ ఎంతోమంది ఈ అలవాటును విస్మరిస్తారు. ఇది కాలేయానికి ఎంతో ప్రమాదం. అలాగే రాత్రి పడుకునేటప్పుడు శరీరంలో డిహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. మీరు ఉదయం లేవగానే నీరు తాగడం వలన శరీరంలోని నీటి కొరతను కూడా భర్తీ చేస్తుంది. మీరు నీరు తాగటం వలన కాలేయంలో ఉన్న విషపూరిత మూలకాలు అనేవి తొలగిపోయి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే మీరు గనక నీరు తాగకుండా మీ రోజును మొదలుపెడితే అది కాలేయం యొక్క ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది…
ఉదయాన్నే నూనె మరియు కొవ్వు పదార్థాలను తినడం : ఉదయాన్నే అల్పాహారంగా ఎంతో మంది వేయించిన ఆహారాన్ని లేక కొవ్వు పదార్థాలను తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ ఆయిల్ మరియు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ అనేది దెబ్బ తినడమే కాక కాలేయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే కొవ్వు పదార్థాలు అనేవి కాలేయంలో కొవ్వు పేరుకొనేలా చేస్తుంది. ఈ కొవ్వు అనేది కాలేయ వ్యాధి ప్రమాదాలను కూడా పెంచుతుంది. ఇది కాలేయం యొక్క సాధారణ పనితీరుకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఎక్కువ కాలం పాటు గనుక నిర్లక్ష్యం చేస్తే మధు మేహం లాంటి ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తుంది…
వ్యాయామం చేయకపోవడం : ఉదయాన్నే కొద్దిసేపు వ్యాయామం చేయటం వలన శరీరానికే కాకుండా కాలేయానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే వ్యాయామాలు చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అలాగే కాలేయ పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. అయితే మీరు రోజంతా కూర్చొని ఉదయాన్నే వ్యాయామం చేయకపోతే వారి కాలేయం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని కారణం చేత కాలేయం ఎంతో బలహీనంగా మారుతుంది. అలాగే భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది…
ఉదయం మిగిలిపోయిన ఆహారం : చాలామంది రాత్రి మిగిలిన ఆహారాన్ని ఉదయాన్నే తింటూ ఉంటారు. అయితే ఈ అలవాటు అనేది కాలేయానికి హాని కలిగిస్తుంది అనే సంగతి మీకు తెలుసా. ఈ చద్ది అన్నం అనేది కాలేయంపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. ఎందుకు అంటే కాలేయం శరీరంలోని బ్యాక్టీరియా మరియు టాక్సిన్స్ ను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాలేయ పనితీరును కూడా ఎంతో బలహీనం చేస్తుంది…
Liver : ఉదయాన్నే మీరు చేసే చెడు అలవాట్లే… మీ కాలేయాన్ని పాడు చేస్తాయి తెలుసా…!!
సిగరెట్, మద్యం తాగడం : ఉదయం నిద్ర లేచిన వెంటనే సిగరెట్ లేక మద్యం తాగటం వలన కూడా కాలేయానికి ఎంతో హాని కలుగుతుంది. ఈ ధూమపానం మరియు ఆల్కహాల్ అనేవి కాలేయ కణాలను దెబ్బతిస్తాయి. అలాగే కాలేయ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. వీటిని సకాలంలో గుర్తించకపోతే లివర్ సిర్రోసిస్ లేక క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.