Vegetables : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో పచ్చి కూరగాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. తీవ్రమైన వ్యాధుల సమస్యల నుండి మనల్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయి. ఇలాంటి కూరగాయలలో సొరకాయ కూడా ఒకటి. ఇది ఎంతో రుచికరమైనది. దీనిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు లాంటి పోషకాలు ఎన్నో ఈ కూరగాయలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్యం లేని వారికి సొరకాయ ఎంతో ఆరోగ్యమైన ఆహార పదార్థం. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ సొరకాయ అంత మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ సొరకాయని ఎవరు తినకూడదు. ఎందుకు తినకూడదు. అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కిడ్నీలోని రాళ్ల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈ సొరకాయను తీసుకోవటం అసలు మంచిది కాదు అని అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా సొరకాయ రసాన్ని తాగకూడదు అని డైటీషియన్స్ చెబుతున్నారు. ఈ సొరకాయలో ఎక్కువ మొత్తంలో ఆక్సలెట్ ఉంటుంది అని, ఇది మూత్రపిండంలో రాళ్ల సమస్యలను మరింతగా పెంచుతుంది అని అంటున్నారు. అలాగే లోబీపీ సమస్య ఉన్నవారు కూడా ఈ సొరకాయ కు వీలైనంత దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకు అంటే. సొరకాయలో ఉన్నటువంటి పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. దాంతో బిపి అనేది మరింతగా తగ్గుతుంది. అయితే ఐ బీపీకి మందులు వాడే వాళ్ళు కూడా ఈ సొరకాయకు దూరంగా ఉంటే మంచిది. ఒక్కోసారి సడన్ గా బీపీ తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అని అంటున్నారు…
బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి వారు కూడా సొరకాయ తీసుకోవడం మంచిది కాదు. అలాగే దీని రసాన్ని తీసుకోవటం మానుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. సొరకాయలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ ను జీర్ణం చేయటం బలహీన జర్ణ వ్యవస్థకు అంత సాధ్యం కాదు. కావున అలాంటి వారు సొరకాయ తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ ఎంతో దెబ్బతింటుంది. అలాగే కడుపు నొప్పి మరియు అజీర్తి, మలబద్ధకం,విరోచనాలు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేగులో పుండ్లు మరియు అల్సర్లు లాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ సొరకాయను అస్సలు తినకూడదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దాని వలన జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పేగులల్లో వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటున్నారు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ సొరకాయ ను తీసుకోవటం అంత మంచిది కాదు. కావున వారు ఈ సొరకాయ, సొరకాయ జ్యూస్ ను చాలా తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా సరే అతిగా తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.