Health Tips : వేసవి.. అంటేనే ఉక్కపోత.. చెమట. ఈ సారి ఎండలు ప్రతి సారి కంటే ఎక్కువవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు పలువురికి ఊపిరాడడం లేదు. వామ్మో ఏంటిది అని అనుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఎవరికైనా చెమట దుర్వాసన వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. పలువురు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారు. చెమట దుర్వాసన వల్ల పక్కవారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చెమట వలన వచ్చే దుర్వాసన నుంచి బయటపడేందుకు చాలా మంది చాలా రకాల డియోడ్రెంట్లను వాడుతుంటారు. కానీ కొంత మంది ఎన్ని రకాల డియోడ్రెంట్లు వాడినా కానీ చెమట వలన వచ్చే సమస్యలను దూరం చేసుకోలేకపోతున్నారు.
అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెమట సమస్య వచ్చేందుకు ప్రధాన కారణాలు ఓ సారి పరిశీలిస్తే..ఈ ట్రెండీ యుగంలో ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ గా కనిపించేందుకు రకరకాల ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటున్నారు. ఇలా ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం వలన అనేక మంది చెమట సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కావున ఫ్యాషన్ దుస్తులు వేసుకునే ముందు అవి మనకు బాగా నప్పుతాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వేసవిలో వదులుగా ఉండే ఫ్యాషన్ దుస్తులనే ధరించాలి. బిగుతుగా ఉండేవి అస్సలుకే వేసుకోకూడదు.
కొవ్వు పదార్థాలు తినడం కూడా చెమట వచ్చేందుకు కారణం అవుతుంది. కావున ఈ వేసవిలో కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడు చెమట సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. వేడి కారణంగా మనకు టెన్షన్, నీరసం వంటివి వస్తాయి. కానీ టెన్షన్ పడడం వలన చెమటలు మరింత ఎక్కువ వస్తాయి. కాబట్టి టెన్షన్ పడడం తగ్గించాలి. వేసవిలో రాత్రి పూట స్నానం చేసి పడుకునే ముందు అండర్ ఆర్మ్స్ కింద డియోడ్రెంట్ రాసి పడుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వలన వేసవిలో చెమట నుంచి ఉపశమనం పొందొచ్చు.
Tirumala Vaikuntha Ekadashi : తిరుపతి వైకుంఠ ద్వార Tirumala Vaikuntha Ekadashi సర్వ దర్శనం టోకెన్ల జారీ లో…
Donald Trump : మొత్తం కెనడాను అమెరికాలో భాగంగా చూపుతూ, కెనడాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ U.S. అధ్యక్షుడిగా ఎన్నికైన…
Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని రెబల్ స్టార్ Prabhas ఫ్యాన్స్…
HDFC : హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంపిక చేసిన HDFC పదవీకాలాలపై దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును…
Game Changer : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju రెండు దశాబ్దాల అనుభవంలో Game Changer మొదటి…
Mayank Agarwal : గత కొద్ది రోజులుగా భారత ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు Mayank Agarwal .…
Rythu Bharosa : జనవరి 26 తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా నిధులు Rythu Bharosa అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం…
Yash : హీరో అవ్వటానికి ఊరిని వదిలేసి మరి ఎందరో పట్నం వచ్చి కష్టాలు పడుతుండడం మనం చూశాం. అలా…
This website uses cookies.