Nagarjuna slowly awakening Akhil
Nagarjuna : అక్కినేని ఫ్యామిలీ హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని మనం సినిమాలో చిన్న కామియో రోల్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు సినిమాలు చేస్తే వరుసగా ఒక్కోటి ఫ్లాప్‌గా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నాయి. దాంతో ఎలాగైనా అఖిల్‌ను హీరోగా నిలబెట్టాలని నాగార్జున రక రకాల ప్లాన్స్ వేసి చివరికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టారు. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని తీసి హిట్ ఇచ్చాడు.ఈ సినిమాతో భాస్కర్ కూడా ఫాంలోకి వచ్చాడు.
మూడు సినిమాల తర్వాత అఖిల్‌కు ఓ హిట్ దక్కడంతో ఇక నాగార్జున ఇదే ఊపులో మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ కథలను అఖిల్ కోసం ఫిల్టర్ చేసి ఒకే చెప్తున్నారు. ఇప్పటికే, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. సురేందర్ రెడ్డి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఆయన కూడా ఓ నిర్మాత కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు.కాబట్టి, ఏజెంట్ సినిమాతో అఖిల్‌కు హిట్ గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు డిసైడయ్యారు.
Nagarjuna slowly awakening Akhil
ఇప్పుడు ఇదే క్రమంలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజాతో అఖిల్ నెక్స్ట్ సినిమాను నాగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్న మోహన్ రాజా సినిమా రిలీజ్ కాకుండానే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఈ మూవీలో సల్మాన్ ఖాన్, పూరి జగనాథ్, నయనతార లాంటి స్టార్‌ను నటింపచేయడమే. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడితో నాగ్ అఖిల్ కోసం సాలీడ్ మాస్ స్టోరీని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. త్వరలో దీనిపై అఫీషీయల్ కన్‌ఫర్మేషన్ రానుందట.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.