Gym : బరువు తగ్గాలంటే ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి. వారు ఇచ్చే డైట్ ప్రకారం తినాలి. అలాగే బయట ఫుడ్ వంటివి తీసుకోకూడదు. ఇలాంటి చేయలేక చాలామంది జిమ్‌కి వెళ్లడం లేదు. డైట్‌ని క్రమంగా ఫాలో అవ్వడం అందరికీ సాధ్యం కాని విషయం. అలాంటి వారు సులువుగా బరువు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గడానికి అందరూ ఎంచుకునే మార్గం డైటింగ్. అయితే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. రోజువారి ఆహారంలో ఫైబర్ లు ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణక్రియ రేటును పెంచడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా కొవ్వు పేరుకుపోదు. కిమ్చి, పెరుగు, కొంబుచా వంటి ప్రోబయోటిక్ ఆహారాలను తినాలి. జీర్ణశయంలోని మంచి బాక్టీరియాలను పెంచి రోగనిరోధక శక్తిని బలపరచడానికి సహాయపడుతుంది. ఇక దీనితో బరువు సులభంగా తగ్గవచ్చు.
అలాగే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆహారంతో కూడా బరువు తగ్గవచ్చు. అదెలా అంటే వంటలో నూనె ,పంచదార ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఇది శరీరంలో తక్కువ క్యాలరీలను ఉంచుతుంది. బరువు తగ్గడానికి మరొక ముఖ్యమైన అంశం నిద్ర సరిపడా నిద్ర లేకపోతే మధుమేహం ఉబ్బకాయ వంటి సమస్యలు వస్తాయి. శరీరానికి ప్రతిరోజు 7-8 గంటల నిద్ర అవసరం. ఒకవేళ నిద్ర పట్టకపోతే శారీరక సమస్యలు పెరగవచ్చు. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి పెరిగితే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత పోతుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. కాబట్టిి జిమ్ కి వెళ్ళకపోయిన అధిక ఒత్తిడికి గురికావద్దు. యోగ వంటివి చేయాలి.
బరువు తగ్గడానికి చాలామంది తక్కువ ఆహారం తీసుకుంటారు. ఈ పొరపాటుని అస్సలు చేయకూడదు. ఒకవేళ శరీరంలో పోషకాహార లోపం తలెత్తితే బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి శరీరానికి అవసరమైన పోషకాహారం తగినంత తీసుకోకపోతే బరువు తగ్గకపోగా శారీరక సమస్యలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల తగినంత నీరు త్రాగడం వలన బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.