Home » Health » What Are The Disadvantages Of Washing Chicken
Health

chicken : చికెన్‌ను కడగాలా? వద్దా?.. కడగడం వల్ల కలిగే నష్టాలేంటి ?..ఎలా శుభ్రం చేయాలి?

Authored By
Suma
The Telugu News | Published on: February 4, 2026, 7:00 am
Advertisement

chicken :  ఆదివారం వచ్చిందంటే చాలు… చాలా ఇళ్లలో మాంసాహారం Meat  తప్పనిసరి అయిపోతుంది. ముఖ్యంగా చికెన్ అయితే ప్రతి వంటగదిలో కనిపిస్తుంది. అయితే చికెన్‌ను ఇంటికి తీసుకువచ్చిన వెంటనే కడగాలా? లేక కడగకుండా నేరుగా వండేయాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు శుభ్రత కోసం తప్పనిసరిగా కడుగుతారు మరికొందరు కడగడం అసలు అవసరం లేదని భావిస్తారు. మరి ఇందులో ఏది సరైన పద్ధతి? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

chicken : చికెన్‌ను కడగాలా? వద్దా?.. కడగడం వల్ల కలిగే నష్టాలేంటి ?..ఎలా శుభ్రం చేయాలి?

chicken : పచ్చి చికెన్‌లో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా

పోషకాహార నిపుణుల మాటల్లో చెప్పాలంటే పచ్చి చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇవి మన కంటికి కనిపించవు కానీ ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. చాలామంది చికెన్‌ను నీటితో కడిగితే ఈ బ్యాక్టీరియా పోతుందని అనుకుంటారు. కానీ నిజానికి కడగడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదు. పైగా నీటి చుక్కలతో కలిసి అవి సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్, పాత్రలు, చేతులు వంటి వాటిపైకి వ్యాపిస్తాయి. ఇది మరింత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

chicken : చికెన్ కడగడం వల్ల కలిగే నష్టాలు

చికెన్‌ను నీటిలో కడగడం వల్ల కేవలం బ్యాక్టీరియా వ్యాప్తి మాత్రమే కాదు ఇంకో సమస్య కూడా ఉంటుంది. అదే చికెన్ రుచి (టేస్ట్). ఎక్కువసేపు నీటిలో కడిగితే లేదా నానబెడితే చికెన్‌లోని సహజమైన రసం బయటకు పోయి వండిన తర్వాత పొడిగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ కిచెన్‌లో ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలపై కూడా బ్యాక్టీరియా చేరవచ్చు. ఇలా క్రాస్ కంటామినేషన్ జరగడం వల్ల కుటుంబ సభ్యులకు ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

chicken : అయితే చికెన్‌ను ఎలా శుభ్రం చేయాలి?

అయితే చికెన్‌ను అసలు శుభ్రం చేయకూడదా? అంటే కాదు. నిపుణులు సూచించే సరైన పద్ధతి ఏమిటంటే చికెన్‌ను నీటితో ఎక్కువగా కడగకుండా, నేరుగా వండే ముందు బాగా ఉడకబెట్టడం లేదా పూర్తిగా వండడం. ఎక్కువ ఉష్ణోగ్రతలో వండితే చికెన్‌లో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా కడగాలనుకుంటే ఒక్కసారి తేలికగా కడిగి వెంటనే ఉడకబెట్టాలి. కడిగిన తర్వాత చేతులు, సింక్, ప్లాట్‌ఫామ్‌లను వేడి నీటితో మరియు సబ్బుతో శుభ్రం చేయడం చాలా అవసరం. కాగా చికెన్‌ను కడగడం కంటే సరైన విధంగా వండడం చాలా ముఖ్యం. శుభ్రత పేరుతో చేసే చిన్న తప్పు పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిపుణుల సూచనలను పాటిస్తూ సురక్షితమైన వంట పద్ధతులను అనుసరించడమే ఉత్తమం. అలా చేస్తే రుచికరమైన చికెన్‌తో పాటు ఆరోగ్యం కూడా మీ చేతిలోనే ఉంటుంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి