Home » Health » Women Dont Put These Next To Your Gas Stove Even By Mistake
Health

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 27, 2025 7:16 pm
Advertisement

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చిన తరువాత ప్రమాదాలు కూడా పెరిగాయి. గ్యాస్ లీక్ అయిన జాగ్రత్త వహించకపోతే ప్రమాదంలో పడతారు. అప్పట్లో,కట్టెల పోయి పై వంట చేసేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ లు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ లేనిదే వంట చేయడానికి ఇబ్బంది పడిపోతున్నారు. కట్టెల పోయి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. గ్యాస్ స్టవ్ పై వంట చేయుటకు ఎంత సులభమైన, దానిలో అంతా డేంజర్ కూడా ఉంది. డేంజర్ తో కూడినది కాబట్టి వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. గ్యాస్ స్టవ్ పక్కన ఎలాంటి వస్తువులను ఉంచకూడదు తెలుసుకుందాం.

Advertisement

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

గతంలో కట్టెల పొయ్యి పైనే వంట చేసుకునేవారు. కానీ ఇది రాను రాను గ్యాస్ పోయిలా వాడకం పెరగడంతో దీని వినియోగం తగ్గిపోయింది. చిటికెలో వంట అయ్యేలా గ్యాస్ పోయిలు వచ్చాయి. గ్యాస్ పోయి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంది. ఒక రోజు గ్యాస్ లేకపోతే సతమతమైపోతారు. పల్లెటూరులో అయితే కట్టెల పోయి వినియోగం ఉంటుంది. కానీ,పట్నాలలో గ్యాస్ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా గ్యాస్ స్టవ్ ని వినియోగిస్తుంటారు. ఎప్పుడైనా సరే,గ్యాస్ లీకేజీ,మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున, గ్యాస్ స్టవ్ లపై వంట చేసేటప్పుడు, జర జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. గ్యాస్ స్టవ్ పై వంటలు చేసేటప్పుడు, కొన్ని వస్తువులని అస్సలు దగ్గర ఉంచకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మహిళలు చేసే పొరపాటు ఏమిటో చూద్దాం..
మహిళలు వంట చేసేటప్పుడు గ్యాస్ పక్కనే,నూనె,మసాలా, పాత్రలు వంటివి దగ్గరలో ఉంచుతారు. ఎందుకంటే వంట చేసేటప్పుడు సులభంగా ఉండాలని, అందుబాటులో ఉండేలా స్టవ్ కి దగ్గరగా పెడతారు. వస్తువులను దగ్గరగా ఉంచితే నష్టం కలిగించడంతోపాటు కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి.

Advertisement

Gas Stove  : గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడని వస్తువులు

మంది వంట చేసేటప్పుడు నూనె డబ్బాలను గ్యాస్ స్టవ్ కి దగ్గరగా ఉంచుకుంటారు.దీనివల్ల వంట చేసేటప్పుడు,నూనె వేడెక్కి నాణ్యత క్షీణిస్తుందని,నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి, దానిని గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకూడదు.

ప్లాస్టిక్ వస్తువులు :  ప్లాస్టిక్ కంటైనర్లు లేదా ఇతర ప్లాస్టిక్ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు.ఎందుకంటే, వేడికి ప్లాస్టిక్ కరిగి మంటలు చెలరేగవచ్చు.

Advertisement

సుగంధ ద్రవ్యాలు : చాలామంది మహిళలు మసాలా దినుసులు డబ్బాలను గ్యాస్ స్టవ్ పక్కనే అందుబాటులో ఉంచుకుంటారు. ఎందుకంటే, వంట తయారీలో సులభతరంగా ఉంటుందని,ఇలా పక్కన పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల సుగంధ ద్రవ్యాల నాణ్యత దెబ్బతింటుంది.

క్లీనర్లు : స్ప్రేలు వంటి క్లీనింగ్ ఉత్పత్తులను గ్యాస్ స్టవ్ దగ్గర అస్సలు ఉంచకూడదు. దీనివల్ల మంటలు చెలరేగవచ్చు.కాబట్టి,మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.

విద్యుత్ ఉపకరణాలు : తూపకరణాలను వేడి ప్రదేశాలలో అస్సలు ఉంచకూడదు. ఎందుకనగా, అధిక వేడి విద్యుత్ ఉపకరణాలను దెబ్బతీస్తుంది. షార్ట్ సర్క్యూట్ లను కలగజేస్తుంది.

మసి బట్టలు : కొంతమంది, మసి బట్టలను గ్యాస్ పక్కనే ఉంచుతారు. దీని వల్ల కొన్ని సార్లు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.కాబట్టి, బట్టలని గ్యాస్ స్టవ్ పక్కన అస్సలు ఉంచకండి.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి