Home » Devotional » Aquarius Horoscope 2024 Kunbha Rashi Phalithalu In Telugu 3
Devotional

Aquarius Horoscope : కుంభరాశి వారికి గురు అనుగ్రహం శని ప్రభావం వలన 2024లో జరగబోయేది ఇదే..!

Authored By
aruna
The Telugu News | Published on: February 12, 2024, 10:00 am
Advertisement

Aquarius Horoscope  : 2024 కొత్త ఏడాదిలో శని రాహు గ్రహ ప్రభావంతో కుంభ రాశి వారికి ఎలా ఉంటుందో అసలు ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయా? 2024 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నూతన సంవత్సరంలో కుంభ రాశి వారిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది. వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయా.. లేదా.. అను పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని సాధిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంలో శుభ ఫలితాలు పొందుతారు. సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కుటుంబ జీవితంలో ఆహ్లాదంగా ఉండొచ్చు.. శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగొచ్చు.. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాసు నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నారు.

Advertisement

దీంతో మొదటి నాలుగు నెలలపాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు. సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. 2024 సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అంతకుముందు ఏవైతే పెండింగ్లో ఉండిపోతాయో ఆ పనులన్నీ ఇప్పుడు ఓ కొలీకి వస్తాయి. ఇక కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. అయితే జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తలు ఇరువురికి ఒకరిపై ఒకరికి ప్రేమ గౌరవం నమ్మకం ఉండాలి. ప్రతి విషయానికి గొడవ పడొద్దు. అయితే ఆర్థికపరంగా వైవాహిక జీవితంలో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.

వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి చెడుల్ని వేరేది వేసుకొని తప్పుడుని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా వ్యాపారాలకు బాగుంది. వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభ రాశి వారు సూర్యుడికి నీరు అర్పించి నమస్కారం చేసుకోవాలి. అలాగే గోమాతకు చపాతీలను తినిపించాలి.. ఈ విధంగా చేయడం వలన మీకు అన్ని విధాల శుభాలు కలుగుతాయి..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి