Home » Devotional » Horoscope 2022 2023 Telugu Year Ugadi And Check Your Zodiac Signs Capricorn
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 మకర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Authored By
pavan J
The Telugu News | Published on: April 3, 2022, 4:30 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మకర రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 9, వ్యయం 2గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. అయితే ఈ ఏడు మకర రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే డబ్బు పొదుపు ఎక్కువ చేస్తారు. కానీ మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య కంటే అవమానించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

Advertisement

కాబట్టి మీరు వీలయినంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే ఈ సంవత్సరం మరక రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది.అలాగే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల చక్కటి ధనలాభం కనిపిస్తుంది. కానీ దీని వల్ల మీరు సుఖం పొందలేరు. అలాగే అక్కాచెల్లెల్లు, అన్నా తమ్ముళ్ల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం కూడా కనిపిస్తోంది.

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs capricorn

Advertisement

విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్త వింటారు. కానీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త ఉద్యోగం దొరకక ముందే పాత ఉద్యోగాన్ని వదలకపోవడం మంచిది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి