Home » Devotional » Horoscope July 2022 Check Your Zodiac Signs Capricorn
Devotional

Zodiac Signs : మకర రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 13, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs ; జూలై మాసం, 2022, మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు‌ మిథునంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తర్వాతి రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నారు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే మకర రాశి లోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మకర రాశి వారికి జూలై నెలలో రావాల్సిన ధనం వస్తుంది. ఆస్తులను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. రియల్ ఎస్టేట్స్ వారికి మంచి పురోగతి ఉంది. అలాగే మకర రాశి లోని మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉత్తరాషాడ నక్షత్రం వారు రుణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బిజినెస్ లోన్ కోసం చూసేవారికి ఈ నెలలో వస్తాయి. శ్రవణ నక్షత్రం వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ధనిష్ట నక్షత్రం వారికి భూ సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారు జూలై నెలలో ఉద్యోగ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

horoscope July 2022 check your zodiac signs Capricorn

Advertisement

మీ సహోదర వర్గాన్ని విదేశాలకు పంపిస్తారు. సినిమా రంగంలో వారికిల ఫ్యాషన్ రంగంలో వారికి మంచి ఫలితాలు రానున్నాయి. కొత్తగా వచ్చే వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా భూమిని కొనుగోలు చేసే విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి వారి ఈ మాసంలో అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే లలిత అమ్మవారిని ఆరాధించాలి. విష్ణు సహస్రనామాలు పఠనం చేయాలి. గోవులకు క్యారెట్లు, బెల్లం తినిపించాలి. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి