Home » Devotional » Horoscope July 2022 Check Your Zodiac Signs Sagittarius
Devotional

Zodiac Signs : ధనస్సు రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 12, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : జూలై మాసం, 2022, ధనస్సు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు. మిథంనంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తరువాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులారాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ధనస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే ధనుస్సు రాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ధనస్సు రాశి వారికి జూలై నెలలో చక్కటి విద్యాయోగం ఉంటుంది. భూములను కొంటారు. ఇంట్లో శుభకార్యాలను చేస్తారు. అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే ధనుస్సు రాశిలో గల మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా మూలా నక్షత్రం వారు జూలై నెలలో కొన్ని పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. పూర్వాషాడ నక్షత్రం వారికి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 13వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు రుణాలు లభిస్తాయి. ఉత్తరాషాడ నక్షత్రం వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 17వ తారీకు తర్వాత సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.  అలాగే ధనూ రాశి వారికి ఈ నెలలో రావాల్సిన ధనం వస్తుంది.

Horoscope July 2022 check your zodiac signs Sagittarius

Advertisement

సంతానం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ప్రేమ వ్యవహారాలలోనూ, వివాహ వ్యవహారాలలోనూ జాగ్రత్త వహించాలి. కొన్ని నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకోవాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా మార్కెటింగ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జులై మాసంలో ధను రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే కుజ, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. నరసింహస్వామిని ఆరాధించాలి. అలాగే విష్ణు సహస్రనామాలను చేయాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది.మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి