Home » Devotional » Horoscope June 2022 Check Your Zodiac Signs Aquarius
Devotional

Zodiac Signs : కుంభ రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: June 20, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : జూన్ నెల 2022లో కుంభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కుంభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బులు త్వరలోనే మీకు చేరబోతున్నాయి. అలాగే మధ్య వర్తిత్వం చేసే వాళ్లకు అమోఘమైన లాభాలు ఉన్నాయి. కాకపోతే వ తేదీ తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే ఈ నెలలో సంపాదించిన లాభాలన్నీ ఈ రెండు మూడ్రోజుల్లోనే హరించుకుపోతాయి.

Advertisement

ఈ మాసం అంతా కొన్న పనులు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలమైనది. విద్యా సంబంధ విషయాల్లో చాలా లాభాలను పొందుతారు. సంతానం కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఐవీఎఫ్ వంటివి చేయించుకోవాలనుకునే వారు ఈ మాసంలో ప్రయత్నించడం మంచిది. పిల్లల కోసం ఏదైనా కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెలలో కొంటే చక్కటి లాభాలను పొందవచ్చు. అలాగే ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసుల వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది.

horoscope june 2022 check your zodiac signs aquarius

Advertisement

అలాగే రుణాల కోసం ప్రయత్నించే వారు ఈ నెలలో లోన్ లను పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో సఫలీకృతమవుతుంది. అది ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం కావొచ్చు. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరసోదరీమణుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాట మాట్లాడేముందు ఒకసారి ఆలోచించండి. ప్రయాణాలు చేసేటప్పుడు, తండ్రి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లలితా సహస్ర నామం వినడం వల్ల మంచి జరుగుతుంది.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి