Home » Devotional » Horoscope June 2022 Check Your Zodiac Signs Pisces
Devotional

Zodiac Signs : మీన రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: June 21, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : జూన్ నెల 2022లో మీన రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మీన రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్లకు ధనయోగం కల్గబోతోంది. ఇక్కడే ఉండి విదేశీ కంపెనీల్లో పని చేసే వారికి కూడా చాలా చక్కటి లాభాలు ఉండబోతున్నాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల అనుకూలమైంది.

Advertisement

కొత్త స్నేహితులు పరిచయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లండి. అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు చేపట్టే వారికి చాలా లాభాలు రాబోతున్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి కచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే బంధు వర్గం వారితో సత్సంబంధాలు ఏర్పడే సూచన కనిపిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామినే వ్యాపార భాగస్వామిగా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

horoscope june 2022 check your zodiac signs Pisces

Advertisement

లేదంటే నష్టాలు వస్తాయి. రాజకీయ రంగం వాళ్లకి, సినీ రంగం వాళ్లకి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఎక్కువాగ కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రితో వైరం ఏర్పడే సూచన ఉంది. అలాగే వాహనంపై ప్రయాణాలు చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కార్తికేయ స్వామి ఆరాధన మంచిది. అలాగే రాజరాజేశ్వర స్వామి అష్టోత్తరం చదవడం వల్ల చాలా లాభుల కల్గుతాయి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి