Home » Devotional » Today Horoscope April 15 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఏప్రిల్ 15 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 14, 2022 9:59 pm
Advertisement

మేష రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబంలో సహకారం లోపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలలో చికాకులు. మిత్రల వల్ల ప్రయోజనం పొందుతారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. శ్రీ దుర్గాదేవి దగ్గర రెడ్‌ కలర్‌ పుష్పాలతో అష్టోతర పూజ చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని చికాకలు కానీ మీ తెలివితేటలతో ముందుకుపోతారు. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దేవాలయ సందర్శన, సమాజ సేవ చేసే అవకాశం కనిపిస్తుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : మీరు చక్కటి ఫలితాలను పొందుతారు. అనుకోని శుభ వార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలం. తల్లి తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ప్రయాణాలు కలసి వస్తాయి. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు. పెద్దల పరిచయాలు. కుటుంబంలో సంతోషం. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు లాభాలు. శ్రీ అన్నపూర్ణా దేవి ఆరాధన చేయండి.

Today Horoscope april 15 2022 check your zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కుటుంబంలో అందరి సహకారంతో ముందుకుపోతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. వ్యాపారాలు లాభల బాటలో పయనిస్తాయి. మహిలలకు వస్త్రలాభం. శ్రీ కనకధార స్తోత్రం వినడం లేదా చదవడం చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకోని కష్టాలు. ఇబ్బందులతో విసుగు,చికాకు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఇంటి పోరుగు వారితో అనుకోని వివాదాలు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. ధన లాభాలతో సంతోషం. కుటుంబంలో సఖ్యత, సహకారం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. విందులు, వినోదాలులకు హాజరవుతారు. శ్రీ లలితాసహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. చిన్నచిన్నపనులు కూడా జాప్యం చేస్తారు. ప్రయాణాలతో చికాకులు. కుటుంబంలో వివాదాలకు ఆస్కారం. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం కాదు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు. కుటుంబంలో అందరూ ఒక్కమాట మీద నిలబడుతారు. అప్పుల కోసం ప్రయత్నం. అనుకోని ప్రయాణాలు. మిత్రలతో కలసి విందులకు హాజరవుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మీకు చక్కటి శుభదినం. అనుకోని లాభాలు, ఆనందం, చక్కటి ఆహారం, విహారంతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. భార్యతరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు :
అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళల ద్వారా లాభాలు పొందుతారు. కుటుంబంలో అందరూ కలసి యాత్రకు ప్లాన్‌ చేసే అవకాశం. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు. ధనలాభ సూచన. విందులు, వినోదాలు. కుటుంబంలో శుభకార్యయోచన. అతిథి రాకతో సందడి. వ్యాపారాలు, విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి శుభ ఫలితాలు వస్తాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి