Home » Devotional » Today Horoscope December 29 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : డిసెంబర్ 29 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 28, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి : మిత్రులు, బంధువులతో విభేదాలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు ఓపికతో, సహనంతో వ్యవహరించండి. ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుల బాధలు. లింగాష్టకం పారాయణం చేసుకోండి. వృషభరాశి : ఈరోజు వివాదాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు విద్య మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Advertisement

మిథునరాశి : మీ తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడిస్తారు.వైవాహికంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు మీ తండ్రి మార్గదర్శకత్వంలో రాణిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి. కర్కాటకరాశి : నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ముఖ్య విషయాలలో చర్చలు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు ఆత్మీయుల నుంచి శుభవార్తలు. పనులు వాయిదా పడుతాయి. తలపెట్టిన పనులన్నీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope December 29 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి : ఈరోజు మీ కుటుంబంతో ఉన్నసత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారంలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగాలకు అర్హులు అవుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

కన్యరాశి : బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యవహారాలలో అవాంతరాలు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

తులరాశి : ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రాత్రి సమయంలో కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథి మీ ఇంటికి వస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి : పెట్టుబడులు పెట్టడం వలన అధిక ధన ప్రాప్తి పొందుతారు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వైవాహికంగా బాగుంటుంది. వాహన కొనుగోలు చేస్తారు. స్నేహితుల మద్దతు ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించండి .

ధనస్సురాశి ; అనవసరంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. స్వల్ప నష్టాలు ఎరపడే అవకాశం ఉంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

మకరరాశి : ఈరోజు ఏదో తెలియని అసంతృప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండాల్సిన రోజు. స్త్రీలు అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

Advertisement

కుంభరాశి : మీతమ్ముడి సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధిచేస్తారు. పనులు పూర్తిచేయడం వల్ల ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీచంద్రగ్రహారాధన చేయండి.

మీనరాశి : ఈరోజు శుభ యోగంగా ఉంటుంది. ఇంటికి బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి