Home » Devotional » Today Horoscope December 30 2021 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : డిసెంబర్ 30 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 29, 2021, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అన్నింటా విజయం. శుభకార్య నిర్వహణ, ఆర్థికంగా సంతోషకరమైన రోజు. మంచి కార్యాలకు రూపం ఇస్తారు. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. చిక్కులు తొలగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీరామ నామాన్ని జపించండి. వృషభరాశి ఫలాలు : ఆనారోగ్య సమస్యలు. మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో వివాదాలకు, ఆర్థిక సమస్యలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటుంది. మహిళలకు అనుకోని చిక్కులు. ఇంటా, బయటా సమస్యలు. గురుచరిత్ర పారాయణం చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : అనుకోని చిక్కులు, వ్యాపారాలు మందగమనం,ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టాలు. ప్రయాణాలు కలసిరావు. ఇష్టమైన వారితో విభేదాలకు అస్కారం. శ్రీకాలభైరావాష్టకం చదువుకోండి.  కర్కాటకరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు. అప్పులు తీరుస్తారు. బంధువుల కలయిక. కుటుంబంతో కలసి విందువినోదాలు. వ్యాపారాలు పరిస్థితులు లాభకరంగా ఉంటాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope december 30 2021 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. చికాకులు. మహిళలకు వివాదాలు. కుటుంబంలో మార్పులకు అవకాశం. అప్పుల కోసం ప్రయత్నం. దైవదర్శనాలు. ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేయండి.

కన్యారాశి ఫలాలు : పెద్దల నుంచి సహకారాలు. ఆర్థికంగా సంతోషకరమైన రోజు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. వాహనయోగం. శుభ ఫలితాల కొరకు గణపతి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : పని వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అనుకోని పనుల వల్ల ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. పాలు, కూరగాయలు, హార్డ్ వేర్ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మంచి ఫలితాల కోసం శ్రీదత్తత్రేయ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. పెద్దల నుంచి ముఖ్య సమాచారం. ధనలాభాలు, కుటుంబం సంబంధించి మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మహిళలకు వస్త్రలాభం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది.గతంలో ఉన్న వివాదాలు తీరతాయి. మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీసాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : పనులు పెండింగ్‌. ఆర్తిక సమస్యలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థికంగా బాధలు తీరడానికి మిత్రులను ఆశ్రయిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. చిన్న వ్యాపారులకు ఇబ్బందులు. అనుకోని ప్రయానాలు. శ్రమ పెరుగుతుంది. సంతానం వల్ల ఇబ్బందులు. అనుకోని మార్పుల వల్ల చికాకులు. శ్రీదత్తత్రేయ కవచం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు, సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభాలు. మనస్సులో తలచిని కార్యం నెరవేరుతుంది. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది.
వస్తులాభాలు. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి