Zodiac Signs : ఫిబ్రవరి 01 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కానీ రోజు గడిచే కొద్ది అనుకూలత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పని పై శ్రద్ధ పెట్టాల్సిన రోజు, ఆర్థిక మందగమనం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది. వృషభరాశి ఫలాలు : ఈరోజు పనిభారం పెరుగుతుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు చేసే వారు జాగ్రత్తగా చేయాలి. అనుకోని ఆటంకాలతో పనులు ముందుకుసాగవు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఉత్సాహంగా ఈ రోజు పనిచేస్తారు. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. పెద్దల నుంచి సలహాలు తీసుకుంటారు. వాటి వల్ల ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు. ఇష్టదేవతను ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చాలా సంతోషంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆప్తులను కలుసుకుంటారు. ధనలాభాలు వస్తాయి. ఫుడ్‌, హోటల్‌, మెడికల్‌ వారికి లాభాలు. విద్యార్థులకు, ఉద్యోగులకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి రోజు. మహిళలకు శుభవార్తలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope February 01 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : అనుకోని చెడు సంఘటనలు జరిగే సూచన కనిపిస్తుంది. ఆనారోగ్య సమస్యలు. ఇంట్లో, బయటా వివాదాలకు ఆస్కారం కనిపిస్తుంది. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు పెద్దగా ముందుకు సాగవు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర నెయ్యి దీపం పెట్టండి.

కన్యారాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. శారీరక శ్రమతో అనారోగ్య సూచన. మనస్సుకు చికాకులు. ఆర్థికంగా బాగుండదు. పెద్దల నుంచి సలహాలు తీసుకుంటారు కానీ వాటిని అమలు చేయక ఇబ్బందులు పడుతారు. ఆర్థికంగా కష్టంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : సంతోషకరంగా ఉండే రోజు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు వస్తాయి. అన్ని రంగాల వారికి మంచిగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి ఫలాలు : అనవసర ప్రయాసలతో చికాకులు. కుటుంబంలో మార్పులకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా సమస్యలు రావచ్చు. ఎవరికి అప్పులు ఇవ్వకండి. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. శత్రు బాధలు పెరిగే సూచన. మహిళలకు పని భారం. మాటపట్టింపులు కనిపిస్తున్నాయి. శ్రీలలితాదేవి సహస్రనామాలతో దుర్గా అమ్మవారి పూజ చేయండి మంచి జరుగుతుంది.

ధనుస్సురాశి ఫలాలు : చాలా రోజులుగా ఉంటున్న సమస్యలు తీరుతాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి వృద్ధి. అన్నింటా విజయం సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. మహిళలకు మంచి రోజు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆర్థికంగా మందగమనం కనిపిస్తుంది. అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి.ప్రయాణాలు చేసి చికాకు పడుతారు. అనారోగ్య సూచన, కుటుంబంలో మార్పులకు అవకాశం కనిపిస్తుంది. మహిళలకు మమూలుగా ఉంటుంది. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటారు. మంచి వార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. అన్ని రకాల వ్యాపారులకు పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు మంచి రోజు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఆనందంగా ఉంటుంది ఈరోజు. మంచి వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మిత్రుల ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అర్థిక పురోగతి, మహిళలకు స్వర్ణ లాభ సూచన. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

11 minutes ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

1 hour ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

3 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

5 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

7 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

9 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

10 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

11 hours ago