Home » Devotional » Today Horoscope February 15 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఫిబ్రవరి 15 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: February 14, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం. అనుకోని నష్టాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. అన్ని రంగాల వారికి ఇబ్బందులు. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఉంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మహిళలకు చికాకులు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. అనుకోని లాభాలు. వస్త్ర వ్యాపారులు, ఆభరణాల వారికి లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు శుభ సూచకం. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు. మహిళలకు లాభాలు,. కుటుంబంలో సమస్యలు వస్తాయి కానీ పెద్దల సహకారంతో అవి పరిష్కారం అవుతాయి. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చాలా మంచి ఫలితాలతో ఉత్సాహంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రాజక్టులు ప్రారంభిస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు శుభం. ఇష్టదేవతారధన చేయండి.

Today Horoscope february 15 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాల : ప్రతికూల వాతావరణం. మిత్రులతో విభేదాలు. అనుకోని దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు లాభాలు రాకపోయినా నష్టాలు రావు. ఆదాయం తగ్గుతుంది. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు లాభాలు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం. మహిళలకు శుభం. కుటుంబంలో సంతోషం. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మంచి రోజు. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువర్గ సహాయంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. మహిళలకు శుభం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : పనులు నెమ్మదిగా పూర్తిచేస్తారు. ఆర్థిక మందగమనం. అన్ని రకాల వృత్తుల వారికి కొంచెం నిస్తేజం. కుటుంబంలో చికాకులు వస్తాయి. పెద్దల మాటలకు విలువనివ్వరు. వ్యాపారాలు మందగిస్తాయి. మహిళలకు వివాదాలు. శ్రీ ఆంజనేయస్వామి దండకాన్ని కనీసం 3 సార్లు పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. కానీ రోజు గడిచే కొద్ది ఇబ్బందులు తగ్గి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక నిస్తేజం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆఫీస్‌లో పనుల్లో జాప్యం. పని భారం పెరుగుతుంది. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కుజగ్రహ స్తోత్రం, ప్రదక్షణాలు చేయండి.

మకరరాశి ఫలాలు : ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల నుంచి సహాయం అందుతుంది. అన్ని రంగాల వారికి అనకూలమైన రోజు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఆ లోచనలు స్థిరంగా ఉంటాయి. మహిళలకు మంచి ఫలితాలు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా ముందుకుపోతారు. అనుకోని లాభాలు, ఆదాయం పెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఉద్యోగాలకు అవకాశం. స్థాన చలనం. అన్ని చోట్ల మీకు మంచి అవకాశాలు. మహిళలకు స్వర్ణ లాభాలు కనిపిస్తున్నాయి. కులదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చికాకులు, సమస్యలు రావచ్చు. ఆర్థిక మందగమనంతో చికాకులు. వ్యాపారాలు సాధారనంగా ఉంటాయి. కుటుంబంలో అస్థిరత, మార్పులు. మహిళలకు అనుకోని చిక్కులు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి