Home » Devotional » Today Horoscope February 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఫిబ్రవరి 16 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: February 15, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు. చక్కటి ఫలితాలతో ఈరోజు మందుకుపోతారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో ముఖ్య మార్పులు. ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిళలకు శుభం. శ్రీరామ ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది. వృషభరాశి ఫలాలు: మిశ్రమంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభవార్తలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు శుభఫలితాలు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. అనుకోని సమస్యలు వస్తాయి. మహిళలకు చికాకులు. శ్రీదుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయలలో పురోగతి కనిపిస్తుంది. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ వారికి ఉపయోగకరంగా ఈరోజు. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు అవకాశాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పనులు పూర్తిచేయడానికి ఈరోజు అవకాశాలు వస్తాయి. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. అనందంగా ఈరోజు గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. మహిళలకు ఆర్థిక లాభాలు. విద్యార్థులకు శుభ ఫలితాలు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope february 16 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు విజయాలు, అవకాశాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. ప్రయణాలు చేయాల్సి రావచ్చు. బాధ్యతలు పెరగడంతో మహిళలకు అలసట. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : చాలా చక్కటి ప్రయోజనకరమైన రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో లాభదాయకమైన విషయం. పదోన్నతులకు అవకాశం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మహిళలకు వస్త్రలాభం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో చక్కటి స్థితి. అన్ని రకాల వృత్తుల వారికి అనకూలమైన రోజు. స్త్రీల ద్వారా పురుషులకు, పురుషులకు, స్త్రీలకు అవకాశాలు వస్తాయి. మహిళలకు శుభ సూచన. విద్యార్థులకు విజయాలు. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ముందుకు పోతారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహంగా కనిపిస్తుంది. పిల్లల ద్వారా సంతోషం. విద్యార్థులకు శుభ ఫలితాలు. ఆర్థికంగా మంచి రోజు. మహిళలకు లాభాలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఆనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలకు శుభదినం. కుటుంబంలో శుభకార్య యోచన. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు ధనలాభం కనిపిస్తుంది. శ్రీశివారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : శుభప్రదమైన రోజు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. రాజకీయంలో ఉన్నవారికి శుభదాయకమైన రోజు. వస్త్రలాభం. ధనలాభం కనిపిస్తుంది. ఆస్తివివాదాలు పరిష్కారం. మహిళలకు శుభం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఇష్టమైన వారి నుంచి ఆహ్వానాలు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్తిక పరిస్థితి వృద్ధికరంగా ఉంటుంది. అనారోగ్య బాధలు పోతాయి. స్థాన చలనం సూచన కనిపిస్తుంది.
మహిళలకు సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహిళలకు లాభాలు వస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి